/rtv/media/media_files/2025/03/20/N4ytHy31DgvTSXifW5Pz.jpg)
Hardik Pandya biography movie
టీమ్ ఇండియా క్రికెటర్‌లలో హార్ధిక్ పాండ్యాకు స్పెషల్ క్రేజ్. ఎప్పుడొచ్చామన్నది కాదు.. గెలిపించామా లేదా అనేది హార్దిక్ సిద్ధాంతం. ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న హార్దిక్.. గతేడాది ఐపీఎల్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మను బదులు హార్దిక్‌ను నియమించడంతో ఘోరమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు.
Also read : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
తమ అభిమాన క్రికెటర్ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తీసి.. హార్దిక్‌కు అప్పజెప్పడంతో విమర్శలు మొదలయ్యాయి. అప్పట్లో మ్యాచులు జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లో ఉన్న హార్ధిక్‌ను ఎంతోమంది హేళన చేశారు. అతడిని ఎంతో బాధపెట్టారు. అయినా హార్ధిక్ మాత్రం ఎక్కడా నోరు జారలేదు. మరింత కసితో ముందుకుసాగాడు.
Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
Hardik Pandya biography movie
ఎవరైతే తనను హేళన చేసారో వారితోనే చప్పట్లు కొట్టించాడు. టీమ్ ఇండియాలో తాను ఎంత కీలకమైన ఆటగాడో తెలియజేశాడు. అలాంటి ఆటగాడిపై ఓ బయోపిక్ తీయాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేవలం ఒక్క సంవత్సరంలో రెండు దశలను చూసిన పాండ్య జీవితాన్ని కచ్చితంగా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని అతడు వ్యాఖ్యానించాడు.
Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
హార్దిక్‌కు ఎంత బాధ, దుఃఖం కలిగినా దానిని తనలోనే దాచుకున్నాడని.. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు కొనసాగాడని తెలిపాడు. కొన్ని రోజులు అతడి ప్రయాణం ఎంతో దారుణంగా ఉండేదని.. ఎంతోమంది అతడిని హేళన చేశారని అన్నారు. హార్దిక్‌ను ఎన్నో అవమానాలు బాధించాయి.. కానీ అతడు ఎక్కడా బాధపడలేదని, అలాగే ముందుకుసాగాడని పేర్కొన్నాడు. మానసికంగా ఎంతో క్షోభ, నరకం అనుభవించిన అతడు.. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటి దుమ్ము దులిపేశాడు.
Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్లాసెన్‌ను ఔట్ చేసి.. టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు. అలాగే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హార్దిక్ చెలరేగిపోయాడని అన్నాడు. ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో జంపా బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టి మరోసారి తన సత్తా చాటాడు. అందువల్ల హార్ధిక్‌పై ఏదైనా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలని అన్నాడు. గత 7నెలలు ఒకెత్తు.. అంతకుముందు ఐపీఎల్ సమయంలో జరిగిన సంఘటనలు మరో ఎత్తని వీటి ఆధారంగా బయోపిక్ తీయొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు.