/rtv/media/media_files/2025/03/27/9Fyc9QtmDwT3SgxidcNc.jpg)
Lucknow Super Giants
ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) , లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్ గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన LSG.. 16.1 ఓవర్లకే 5 వికెట్ల తేడాతో టార్గెట్‌ను సునాయసంగా పూర్తి చేసింది.నికోలస్ పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు (6 సిక్సులు, 6 ఫోర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ మార్ష్ 52 పరుగులతో హాఫ్ సెంచరీ చేశారు. SRH నుంచి కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
— Lucknow Super Giants (@LucknowIPL) March 27, 2025
Also Read: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఆ ఇద్దరు ఔట్!
మొదటగా బ్యాటింగ్ చేసిన SRH.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (47), నితీశ్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36) పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే SRHకు షాకులు తగిలాయి. మొదటి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్ మనోహర్ (0) నిరాశపర్చారు. లక్నో టీమ్ నుంచి షార్దుల్ ఠాకుర్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
The Uppal uproar 🤯pic.twitter.com/5NJ4PjtfNR
— Lucknow Super Giants (@LucknowIPL) March 27, 2025
Aag laga di 🔥🔥🔥 pic.twitter.com/KBOym10nIB
— Lucknow Super Giants (@LucknowIPL) March 27, 2025
Also Read: కిక్కే కిక్కు.. వారికి ఫ్రీగా IPL మ్యాచ్ పాస్‌లు- ఇలా అప్లై చేసుకోండి
ipl-2025 | sun-risers-hyderabad | lucknow-super-giants | telugu-news | rtv-news