LSG vs PBKS IPL 2025: కష్టాల్లో లక్నో సూపర్ జెయింట్స్.. స్టార్ బ్యాటర్లందరూ ఔట్- స్కోర్ ఎంతంటే?

నేడు లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ మద్య మ్యాచ్ జరుగుతోంది. తొలి బ్యాటింగ్ చేస్తున్న లక్నో జట్టు కష్టాల్లో పడింది. తక్కువ పరుగులకే మార్‌క్రమ్, పంత్, మార్ష్, పూరన్ ఔటయ్యారు. దీంతో లక్నో స్కోరు 13ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.

New Update
LSG vs PBKS IPL 2025 live score: Pooran falls short of fifty, Punjab Kings back on top

LSG vs PBKS IPL 2025 live score: Pooran falls short of fifty, Punjab Kings back on top

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చారు. ఫస్ట్ ఓవర్‌లోనే లక్నో జట్టుకు గట్టి షాక్ తగిలింది. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

మిచెల్ మార్ష్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. అర్ష్‌దీప్ వేసిన 0.4 ఓవర్‌కు అతడు మర్కో యాన్సర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి ఈ ఇద్దరూ మంచి ఫామ్ కనబరిచారు. కానీ వరుస వికెట్లతో లక్నో కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడిన మార్‌క్రమ్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

కష్టాల్లో లక్నో జట్టు

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఇక సిక్సర్లతో పూనకాలు తెప్పించిన పూరన్ కూడా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో స్టార్ బ్యాటర్లందరూ వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది. తక్కువ పరుగుల వద్దే ప్రస్తుతం ఉంది. 13 ఓవర్లకు గానూ లక్నో జట్టు 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చూడాలి మరి ఫైనల్ ఎంత స్కోర్ చేస్తుందో.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

(lsg | IPL 2025 | sports-news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు