/rtv/media/media_files/2025/03/22/qQb5tJnYw8CS8VNTzZFb.jpg)
ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.
KKR vs RCB హెడ్-టు-హెడ్ రికార్డు:
ఆడిన మ్యాచ్‌లు: 34
కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది: 20
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది: 14
ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును సమం చేస్తారు.
కోల్‌కతా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.
బెంగళూరు : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
Also read : IPL కోసం బిగ్గెస్ట్ 55 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఆఫర్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!