IPL 2025 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న (శనివారం) CSK Vs Dc మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. దాదాపు 25 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ధోని రిటైర్మెంట్?
ఢిల్లీతో మ్యాచ్ తర్వాత MS ధోని రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు.. అలాగే భార్య, కూతురు కలిసి స్టేడియంలో మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. మ్యాచ్ అనంతరం ధోని తన తండ్రి పాదాలను తాకుతూ కనిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ ప్రచారంపై ధోనీ ఎలాంటి ప్రకటన చేస్తారు అనే టెన్షన్‌లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఇదిలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆట తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్ సమయంలో ధోని ఆఖరి వరకు క్రీజ్‌లో ఉన్నా.. ఎలాంటి పెద్ద షార్ట్‌లు ఆడకపోగా.. అతడు బాల్స్ డాట్ చేశాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. ధోని ఐపీఎల్ చాలా కాలంగా ఆడుతున్నాడని. అతడు ఇప్పుడు రిటైర్ అయ్యి.. కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.
(ms-dhoni | latest-telugu-news | telugu-news | sports-news)