/rtv/media/media_files/2025/03/23/ttYfY7g16CFelVamszLH.jpg)
Sports
ఆటలు ఆడటం ప్రతిఒక్కరి ముఖ్యమే. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది. సాధారణంగా ప్రజలు అప్పడప్పుడు ఆటలు ఆడుతుంటారు. మరికొందరు వాటినే జీవనాధారంగా చేసుకుంటారు. వివిధ క్రీడల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? ఇప్పుడు దీని గురించే తెలుసుకుందాం.
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్
ఫుట్‌బాల్ (సాకర్)
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆదరిస్తున్న ఆట ఫుట్‌బాల్. ఈ క్రీడకు మొత్తం 400 కోట్ల మందికి పైగా అభిమానులు ఉన్నారు. దీనికి అభిమానులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆట ప్రధాన టోర్నమెంట్లు ఫీఫా వరల్డ్ కప్, UEFA ఛాంపియన్స్ లీగ్, యూరో కప్, కోపా అమెరికా. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న దేశాలు బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా.
క్రికెట్
భారత ఉపఖండంతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి దేశాలు ఎక్కువగా ఆదరించే ఆట క్రికెట్. దీనికి ప్రపంచవాప్తంగా 250 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లో ఈ క్రీడకు ఎక్కువగా అభిమానులున్నారు.
బాస్కెట్ బాల్
బాస్కెట్‌బాల్ అమెరికాలో ఎంతో ప్రాచూర్యం పొందిన ఆట. దీనికి 240 కోట్ల మంది అభిమానులున్నారు. ఈ ఆట ప్రధాన టోర్నమెంట్లు NBA, FIBA వరల్డ్ కప్, ఒలింపిక్స్. అమెరికాతో పాటు చైనా, ఫిలిప్పీన్స్, కెనడా, స్పెయిన్‌లో ఈ క్రీడకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు.
టెన్సీస్
టెన్నీస్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అభిమానులున్నారు. ఇది వ్యక్తిగత ఆటగాళ్ల మధ్య జరిగే కఠినమైన క్రీడల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ప్రధాన టోర్నమెంట్లు వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్.
హాకీ
హాకీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనికి 50 కోట్ల మంది అభిమానులున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, యూరోప్ దేశాల్లో ఈ క్రీడకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీని ప్రధాన టోర్నమెంట్లు FIH వరల్డ్ కప్, ఒలింపిక్స్, హాకీ ఇండియా లీగ్.
telugu-news | national-news | sports | football | cricket