/rtv/media/media_files/2025/03/06/kXnv5CpdKfeyHGGMBWBl.jpg)
KL Rahul is being used like a spare tyre by the team management
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చివరి వరకు ఉండి జట్టును గెలిపించాడు. చివరి సిక్స్‌తో మ్యాచ్‌ను క్లోజ్ చేసేసాడు. అతడి ఆటతీరుపై తాజాగా మాజీ క్రికెటర్ సిద్ధూ ప్రశంసలు కురిపించాడు. జట్టుకు ఏ అవసరం ఉన్నా.. నేనున్నా అంటూ రాహుల్ సిద్ధంగా ఉంటాడని అన్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అతడు మాట్లాడాడు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
స్పేర్ టైర్‌లా వాడేశారు
స్పేర్ టైర్‌ను వాడినట్లుగా కేఎల్ రాహుల్‌ను వాడుతున్నారని అన్నారు. అతడితో వికెట్ కీపింగ్ చేయిస్తారని.. అలాగే 6 ప్లేస్‌లో బ్యాటింగ్‌కి దింపుతారని అన్నారు. అయితే ఒక్కోసారి ఓపెనింగ్‌కి పంపించి ఆడమంటారని.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ వచ్చిందంటే.. 3 ప్లేస్‌లో వెళ్లు అని అంటారని అన్నాడు. ఆ సమయంలో పేసర్లను తట్టుకోవడానికి అతడిని పంపిస్తారని తెలిపాడు.
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
దాని తర్వాత మళ్లీ ఓపెనింగ్ చేయి అని అతడినే ముందుకు తోస్తారని చెప్పుకొచ్చాడు. ఎక్కడ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందో.. అక్కడే కేఎల్ రాహుల్‌ను ఆడమంటారని తెలిపాడు. అయితే దానికి రాహుల్ కూడా కాదు అనకుండా.. చెప్పినట్లుగా చేస్తాడని.. అది నిస్వార్థమైన ఆటతీరు అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు దేశం కోసం నిస్వార్థంగా త్యాగం చేసేవారు చాలా గొప్పవారు అని ఆయన కేఎల్ రాహుల్‌ని పొగడ్తలతో ముచ్చెత్తాడు.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
మరోవైపు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ కంటే కేఎల్ రాహులే ముందు వచ్చి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ మంచి పార్ట్‌నర్‌షిప్ చేశాడని.. అయితే ఆ ప్లేస్‌లో కేఎల్ రాహుల్ ఉన్నా 30 పరుగులు చేసి ఉండేవాడని చెప్పుకొచ్చాడు. కాగా రాహుల్ క్లాస్ ఆటగాడని కొనియాడాడు. ఈ ఇన్నింగ్స్ అతడిలో కచ్చితంగా ఆత్మవిశ్వాసం పెంచుతుందని తెలిపాడు. అతడు సత్తా చాటాడు అని చెప్పుకొచ్చాడు.