Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ బుమ్రాకు అరుదైన గౌరవం.. తొలి బౌలర్ గా రికార్డు

భారత స్టార్ పేసర్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఏడాదికిగానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఈ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్‌గా.. తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

New Update
Jasprit Bumrah Named ICC Men's Test Cricketer Of The Year For 2024

Jasprit Bumrah Named ICC Men's Test Cricketer Of The Year For 2024

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాటర్ కి అయినా చుక్కలు చూపించేస్తాడు. బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టడం ఖాయమనే చెప్పాలి. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా బుమ్రా బంతికి జడాల్సిందే. 

అతడి బౌలింగ్ లో సిక్స్ కొట్టే ప్రయత్నం చేయాలంటే.. వికెట్ ను రిస్క్ లో పెట్టడమనే చెప్పాలి. ఐపీఎల్, టీ20, వన్డే, టెస్ట్ ఇలా ప్రతీ మ్యాచ్ లోనూ బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో బుమ్రా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

బుమ్రాకు అరుదైన గౌరవం

అలాంటి స్టార్ పేసర్ బుమ్రాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు బుమ్రాకు వరించింది. 2024 ఏడాదికి గానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. ఈ అవార్డుకు జో రూట్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) పోటీ పడగా.. వారిని వెనక్కి నెట్టి బుమ్రా దక్కించుకున్నాడు. 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి, 2024లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

తొలి బౌలర్ గా బుమ్రా

ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్‌గా.. అలాగే తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించారు. మొదటిగా రాహుల్ ద్రవిడ్ 2004 లో ఈ అవార్డును అందుకున్నాడు. అలాగే గౌతమ్ గంభీర్‌ 2009లో, వీరేంద్ర సెహ్వాగ్ 2010లో, రవిచంద్రన్ అశ్విన్ 2016లో, విరాట్ కోహ్లీ 2018లో ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇక ఈ అవార్డు బుమ్రాకు దక్కడంపై అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు