/rtv/media/media_files/2025/04/08/vDwnYZcWQVbQbvdzqLYO.jpg)
IPL 2025 Punjab Kings huge score against Chennai
CSK Vs PBKS: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు.
Sarpanch Saab 🤝 Rocket Raja! ❤💛 pic.twitter.com/gQ6V76FslF
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ..
ఈ మేరకు ముల్లనూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు.
This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
తుది జట్లు..
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, ల్యూకీ ఫెర్గూసన్, చాహల్.
Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’
చెన్నై : రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవింద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), అశ్విన్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరీ, ఖలీల్ అహ్మద్, పథిరన.
Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
IPL 2025 | telugu-news | today telugu news