IPL 2025 Points Table: ‘ఈ సాలా కప్ నమ్‌దే’.. ఫస్ట్ ప్లేస్‌లో RCB.. ఇక రచ్చ రచ్చే!

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 7మ్యాచ్‌లు జరిగాయి. దీనికి సంబంధించిన పాయింట్ల పట్టిక రిలీజ్ అయింది. అందులో RCB జట్టు 2 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అని అంటున్నారు.

New Update
IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM

IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM

ఐపీఎల్ 2025 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది. చివరి నిమిషం వరకు ఏ జట్టు గెలుపొందుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ రేకెత్తిస్తుంది. ఇప్పటికి మొత్తం 7 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు

మొదటి మ్యాచ్ కోల్‌కతా VS బెంగళూరు జరగగా.. అందులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 

అలాగే నెక్స్ట్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ VS రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో SRH జట్టు విజయం సాధించిది.

తర్వాత ముంబై ఇండియన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ ఉత్కంఠ పోరులో CSK గెలుపొందింది. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

నాలుగో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఇందులో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 

ఐదో మ్యాచ్ పంజాబ్ VS గుజరాత్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 

రాజస్తాన్ రాయల్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ మద్య 6వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో KKR గెలుపొందింది. 

7వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో SRH ఓటమిపాలైంది. LSG జట్టు విజయం సాధించి తొలి ఖాతా తెరిచింది. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM
IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM 

 

ఇలా ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల రిజల్ట్స్ చూశాం. ఇవాళ నువ్వా నేనా అన్నట్లు ఒక మ్యాచ్ ఉండబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. 

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

ఫస్ట్ ప్లేస్‌లో RCB

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల పాయింట్ల పట్టిక వెల్లడైంది. దాని బట్టి చూస్తే బెంగళూరు జట్టు 1 మ్యాచ్ ఆడి గెలిచి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇది 2 పాయింట్లతో 2.137 రన్‌రేట్‌ను కలిగి ఉంది. సెకండ్ ప్లేస్‌లో లక్నో జట్టు ఉంది. ఇది 2 మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి.. మరొకటి గెలిచింది. దీంతో 2 పాయింట్లతో 0.963 రన్‌రేట్‌ను కలిగి ఉంది. మూడో ప్లేస్‌లో పంజాబ్ ఉంది. ఇది 1 మ్యాచ్ ఆడి గెలిచి 2 పాయింట్లు అందుకుంది. అదే సమయంలో 0.550 రన్ రేట్‌ను కలిగి ఉంది. 

IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM.
IPL 2025 POINTS TABLE LIST FIRST PLACE ON RCB TEAM

 

(ipl-2025 | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment