/rtv/media/media_files/2025/03/24/rA3xBxbHkBCidU9Fo6x9.jpg)
ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. ఆదివారం చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీనితో, ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అది ఏంటంటే వరుసగా 13వ ఏడాది కూడా ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ను ఓటమితోనే షురూ చేసింది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభిస్తూ వచ్చింది. చివరిసారిగా 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై తమ సీజన్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. 2013 నుండి వరుసగా తొలి మ్యాచ్ లో ఓటములను చవిచూస్తోంది. అయితే ఐపీఎల్ లో ఇలాంటి రికార్డు మరే టీమ్ కూడా లేదు.
Also read : BCCI కీలక ప్రకటన..మహిళా క్రికెటర్లకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్!
Also Read : కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
మ్యాచ్‌లో ఏం జరిగింది?
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 29, దీపక్ చాహర్ 28 పరుగులు చేశారు. చెన్నై తరఫున నూర్ అహ్మద్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు.టార్గెట్ కోసం బరిలోకి దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. రచిన్ రవీంద్ర అజేయంగా 65 పరుగులు చేయగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు చేశాడు. చెన్నై తదుపరి మ్యాచ్‌లో మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది, ముంబై ఇండియన్స్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
Also read : Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!
Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
ipl-2025 | chennai-super-kings | mumbai-indians | latest-telugu-news | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news