/rtv/media/media_files/2025/03/30/WpKUGplDuhe91cNzvLXk.jpg)
mi vs gt Photograph: (mi vs gt)
IPL 2025: ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్‌లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా పాండ్య నిలిచాడు.
Smiles that made our evening better!😁 pic.twitter.com/SX74VFSYIn
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2025
ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం..
ఈ మేరకు ‘ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం చేసింది. కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ. 12 లక్షల జరిమానా విధించాం' అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ప్రకటించింది. అయితే కొత్త ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ పై వేటు పడదు. కానీ జరిమానా విధించడంతోపాటు డిమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు. ఇవి 36 నెలలపాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ ఈసారి ఆరంభం నుంచే బోల్తా పడుతోంది. ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో సీఎస్కే మీద మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని చేయలేకపోయింది. సూర్య కుమార్, తిలక్ వర్మ కష్టపడినా రోహిత్ తో సహా మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో ముంబై మ్యాచ్ ఓడిపోయింది. సూర్యకుమార్ 49 పరుగులు చేసి చివర్లో క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ముంబై ఇండియన్స్ మీద 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. జీటీ బౌలర్స్ లో సిరాజ్ 2, ప్రసిధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 1, రబడా 1 వికెట్లు తీశారు.
ipl-2025 | mumbai | gujarath | telugu-news | today telugu news
Rohit Sharma: నా క్యారెక్టర్ మారింది.. మైండ్‌సెట్ కాదు.. హిట్ మ్యాన్ సంచలన కామెంట్స్!
ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.
Rohit Sharma interesting comments on Mumbai Indians
Rohit Sharma: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ముంబైకి కెప్టెన్‌గా, మిడిలార్డర్, ఇప్పుడు ఓపెనర్ బ్యాటర్‌గా పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకున్నట్లు తెలిపాడు. అయితే తన పాత్రలు మారుతూ వస్తున్నాయి కానీ.. తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏం చేయాలో అదే చేస్తున్నా..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఇందులో ఏ మార్ప లేదు. మ్యాచ్ గెలవాలి. ట్రోఫీలు సొంతం చేసుకోవడంపైనే ఫోకస్ ఉంటుంది. ముంబై ఇండియన్స్‌కు ఇదంతా తెలుసు. కొన్నేళ్లుగా చాలా ట్రోఫీలను గెలుచుకున్నాం. విజేతలుగా నిలుస్తున్నాం. ముంబై ఇండియన్స్ కల్చర్ ఏంటో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మా టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే. మళ్లీ ముంబై ఇండియన్స్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే అన్నాడు.\
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
ఇక ముంబైలో విదేశీ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.. ట్రెంట్ బౌల్ట్‌కు ఎంతో అనుభవం ఉందన్నాడు.మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ సారథి క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. విల్ జాక్స్, రీస్ టోప్లేతో జట్టులో వైవిధ్యం తీసుకొచ్చాం. రియాన్ రికెల్‌టన్ యువ క్రికెటర్ దూకుడుతోపాటు నిలకడగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. భారత యువ ప్లేయర్లు ముంబైలో చాలామంది ఉన్నారు. వారితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’
rohit-sharma | mumbai-indians | telugu-news
Kodali Nani Health: కొడాలి నానికి సర్జరీ పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
Nabha Natesh: పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే
Muda scam: MP, MLAల స్పెషల్ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్
Heavy rains : మండుతున్న ఎండలకు కూల్ న్యూస్...నాలుగు రోజులు భారీవర్షాలు
Dhanush: 6 ఏళ్ళ తర్వాత ఓటీటీలో ధనుష్ తొలి హాలీవుడ్ ఫిల్మ్.! స్ట్రీమింగ్ ఎక్కడంటే