/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dhoni-jpg.webp)
MS Dhoni
ఐపీఎల్-2025లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్‌కే చేధించలేకపోయింది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.
ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్
At the age of 43, MS Dhoni holds the record for scoring the most runs for CSK in IPL history, surpassing Suresh Raina's 4,687 runs 💛🔥🔝#MSDhoni #IPL2025 #CSK #Sportskeeda pic.twitter.com/u59BZgHNTY
— Sportskeeda (@Sportskeeda) March 28, 2025
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ధోని
తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట క్రియేట్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
ఇది కూడా చూడండి: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
ఇప్పటి వరకు మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి ధోని 4693 పరుగులు చేశాడు. అయితే ఇంతకు ముందు ఈ రికార్డు సురేష్ రైనాపైన ఉండేది. రైనా సీఎస్‌కే తరపున 4,687 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని పరుగులు చేయడంతో సీఎస్‌కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.