/rtv/media/media_files/2025/04/08/BB44ICTDZpgizmsrKgfg.jpg)
IPL 2025 Lucknow Supergiants win against Kolkata Knight Riders
KKR Vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.
Mishti doi for the team tonight 💙 pic.twitter.com/LnUzcG8Vy1
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025
ఒపెనర్ల విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) నాలుగో అర్ధ శతకం చేశాడు. నికోలస్ పూరన్ (87*; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. మార్‌క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ తీశారు.
Fight back jaari hai 💪 pic.twitter.com/LGobBk3ktF
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025
ఇక కోల్‌కతా ఓపెనర్లు డికాక్ 15(9), సునీల్ నరైన్ 30 (13) ధాటిగా ఆరంభించారు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్ రహానె 61 (35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ 45 (29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కానీ రమణదీప్ సింగ్ (1), రఘువంశీ (5), రస్సెల్ (7) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. రింకూ సింగ్ 38 (15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్ రాణా 10 (9 బంతుల్లో 2 ఫోర్లు) చివరిలో మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్‌దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీయగా, అవేశ్‌ఖాన్, దిగ్వేష్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
IPL 2025 | telugu-news | today telugu news