SRH vs LSG: పంత్ ఎన్ని పరుగులు చేస్తాడో చెప్పేసిన Grok.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ జరగనుంది. అయితే గత మ్యాచ్ లో డకౌట్ అయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే ప్రశ్నపై Grok ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇన్నింగ్స్‌ మంచిగా ప్రారంభిస్తే 25 నుంచి 50 పరుగులు చేస్తాడని తెలిపింది. 

New Update
srh vs lsg grok

SRH vs LSG:  ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ జరగనుంది. అయితే గత మ్యా్చ్‌లో డకౌట్ అయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే ప్రశ్నపై Grok ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇన్నింగ్స్‌ మంచిగా ప్రారంభిస్తే 25 నుంచి 50 పరుగులు చేస్తాడని తెలిపింది. 

ఈ మేరకు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌ గ్రౌండ్ లో పంత్ ఎన్ని పరుగులు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ లో ఆరు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్  విలువైన ఆటగాడు కావడం చర్చనీయాంశమైంది. 27 కోట్లకు కొనుగోలు చేసిన గొయోంక.. పంత్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.  ఈ క్రమంలోనే ఓ క్రికెట్ అభిమాని హైదరాబాద్ లో పంత్ ఎన్ని పరుగులు చేస్తాడంటూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) చాట్‌బాట్‌ గ్రోక్ (Grok)ను ప్రశ్నించాడు. దీంతో ఆసక్తికర సమాధానం చెప్పింది. 

Also Read: శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం.. ఉతికారేసిన రూ. 5 కోట్ల ఆటగాడు!

రిషబ్ పంత్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడుతుంటాడు. ఇన్నింగ్స్ శుభారంభం దక్కితే కనీసం 25 నుంచి 50 పరుగులు చేస్తాడు. పంత్ టాప్‌ ఆర్డర్‌లో లేదా మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చు. ఐపీఎల్‌ కెరీర్‌లో 148 స్ట్రైక్‌రేట్‌ ఉంది. దూకుడుగా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. మ్యాచ్‌కు తగినట్లుగా ఇన్నింగ్స్‌ ఆడుతుంటాడు. లఖ్‌నవూ మొదట బ్యాటింగ్‌ చేస్తే పంత్ 30- నుంచి 40 పరుగులు చేస్తాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

Also Read: ఏందీ సిరాజ్ అన్న.. రూ.12 కోట్లు బొక్క.. 54 పరుగులిచ్చి!

ipl-2025 | rishab-pant | grok ai | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MI vs KKR: మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్‌టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. 

New Update
Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

Rohith Sharma

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి ఇన్నింగ్స్‌ను పూర్తి చేసుకుంది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు కేకేఆర్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు ఆలౌట్ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో బోణీ కొట్టాలంటే 117 పరుగులు చేయాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్‌టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. 

Advertisment
Advertisment
Advertisment