/rtv/media/media_files/2025/01/22/UP7NJJ6GXHvqgLce9bmL.jpg)
India Vs England
వరుస పరాజయాలు టీమ్ ఇండియాను డీలా చేశాయి. ఘోర అపజయాలు అవమానాలకు దారి తీసింది. ఆ చేదు జ్ఞాపకాలను వీలైనంత తొందరగా చెరిపేయాలని అనుకుంటోంది భారత జట్టు. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ సొంతగడ్డపై పరీక్షకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే ఇంగ్లాండ్ తో అయిదు మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడనుంది టీమ్ ఇండియా. సూర్యకుమార్ కెప్టెన్సీలో కుర్ర జట్టు బరిలోకి దిగుతోంది.
5 టీ20లు, 3 వన్డేలు...
ఇంగ్లాండ్ తో..టీమ్ ఇండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఇవన్నీ ఇక్కడే భారత్ లో జరగనున్నాయి. ఈ రోజు నుంచే ఈ సమరానికి తెర లేస్తోంది. కోలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. చెన్నై (25న), రాజ్‌కోట్ (28), పుణె (31), ముంబయి (ఫిబ్రవరి 2న) వరుసగా తర్వాతి మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీని తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ కూడా ఇంగ్లాండ్ తో ఆడనుంది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాని ముందు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే రెండు సీరీస్ లేు గెలవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. దానికి తోడు బీసీసీఐ ఇందులో కుర్రాళ్ళతో ప్రయోగాలు చేస్తోంది. దానిని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిని బరిలోకి దింపాలన్నది నిర్ణయించనుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 12 వరకు జట్టును మార్చే అవకాశం ఉంటుంది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, సంజూ శాంసన్ లాంటి వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు కనుక వీరిద్దరూ ఇంగ్లాండ్ తో జరిగే సీరీస్‌లో బాగా ఆడితే తుది జట్టులోకి ఎంపిక చేసే ఛాన్స్ లు చాలా బలంగా ఉన్నాయి.
మరోవైపు టీ20ల్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ గా ఉంది. దానిని ఢీకొనడం అంత తేలికేమీ కాదు. అయితే ప్రస్తుతం ఉన్న టీమ్ ఇండియా కుర్రాళ్ళ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. టెస్ట్ ల్లో ఫెయిలయినా...టీ20ల్లో నిలకడగానే ాడుతున్నారు. నిజం చెప్పాలంటే అద్భుతాలు చేస్తున్నారు. అలాగే వన్డేల్లో కూడా దుమ్ము రేగ్గొట్టే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్ ను మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు ఈ సీరీస్ లో బ్యాటర్ సంజూ శాంసన్ కీపర్గా వ్యవహరించనున్నాడు. ఇతను సక్సెస్ అయితే ఇతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read: USA: గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..