/rtv/media/media_files/2025/03/02/eDeuZH9MJkF5VsTL9cXo.jpg)
India Vs New Zealand Champions Trophy 2025.
భారత్ vs న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్‌ను ఆలౌట్ చేసి.. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్‌సన్ అదరగొట్టేశాడు. ఫోర్లు సిక్సర్లతో ఔరా అనిపించాడు. 120 బంతుల్లో 81 పరుగులు చేసి ఒక్కడే పోరాడాడు. మిగిలిన విల్ యంగ్ (22) , డారిల్ మిచెల్ (17) పరుగులు, టామ్ లేథమ్ (14) పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ (12)పరుగులు, రచిన్ రవీంద్ర (6)పరుగులు పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అదరగొట్టేశాడు. ఒక్కడే 5 వికెట్లు తీసి అట్రాక్షన్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కుల్‌దీప్ 2, హార్దిక్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో ఒక్కో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 250 టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ క్రమంలో 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇది కూడా చూడండి: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
#ChampionsTrophy2025 #INDvNZ #ShreyasIyer #INDvsNZ
— TOI Sports (@toisports) March 2, 2025
India in semis!!!!
Varun (5/42) stars as India (249/9) beat NZ (205) by 44 runs to set up semi-final with Australia
HIGHLIGHTS: https://t.co/VEUjUP9eEX pic.twitter.com/4Bq9nJJmQN
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
శ్రేయస్ అదరహో
ఇక భారత్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేశాడు.98 బంతుల్లో 79 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో హైయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ సైతం మెరుపు ఇన్సింగ్‌తో ఆకట్టుకున్నాడు. 61 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో రాణించాడు.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
హార్దిక్ పాండ్య రచ్చ
ఇక చివర్లో హార్దిక్ పాండ్య అయితే రచ్చ రచ్చ చేశాడు. పరుగుల వర్షం కురిపించాడు. 45 బంతుల్లో 45 పరుగులు సాధించి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ (23), జడేజా (16) పరుగులు సాధించారు. రోహిత్ శర్మ (15) పరుగులు, శుభ్‌మన్ గిల్ (2) పరుగులు, విరాట్ కోహ్లీ (11) పరుగులతో అభిమానులను నిరాశపరిచారు. ఆట ప్రారంభమయ్యే సమయంలో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..