IND vs ENG: భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది.. ఈసారి వదలం: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా

తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపై ఇంగ్లండ్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పందించాడు. టీమిండియా బ్యాటర్లకు అదృష్టం కలిసి రావడం వల్లనే ఆ జట్టు విజయం సాధించిందని అన్నాడు. రెండో టీ20లో మాత్రం వదిలి పెట్టమని పేర్కొన్నాడు. ఈసారి కచ్చితంగా గెలుస్తామని ఆర్చర్ వెల్లడించాడు. 

New Update
England jofra archer about india win 1st t20i

England jofra archer about india win 1st t20i

IND vs ENG: భారత్ - ఇంగ్లండ్ మధ్య 5 టీ20ల సిరీస్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా కొట్టేసింది. కేవలం 13 ఓవర్ల లోపే ఈ రన్స్ ఛేదించింది. 

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది..

అయితే భారత్ తొలి విజయం పై ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటర్లకు అదృష్టం కలిసి రావడం వల్లనే ఆ జట్టు విజయం సాధించిందని అన్నాడు. అయితే రెండో టీ20 లో మాత్రం అస్సలు వదిలి పెట్టేదే లేదని పేర్కొన్నాడు. చాలా బాల్స్ గాల్లోకి లేచి ఫీల్డర్లకు దూరంగా పడటంతో టీమిండియా బ్యాటర్లు ఔట్ కాలేదన్నాడు. 

Also Read :  నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

అవన్నీ జరిగితే మాత్రం టాప్ 6 బ్యాటర్లను కేవలం 40 రన్స్‌కే ఆపేవాళ్లమని చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ తనకు బాగా సహకరించిందని అన్నాడు. ఇతర బౌలర్లతో పోలిస్తే తనకు చాలా బాగా అనుకూలంగా ఉందని చెప్పాడు. తమలో చాలా మంది బాగా బౌలింగ్ చేశారని.. కానీ భారత బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చిందని అన్నాడు. 

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

కొన్ని బంతులు గాల్లోకి వెళ్లి ఫీల్డర్లకు దూరంగా పడ్డాయని.. కానీ ఈసారి అవి నేరుగా చేతుల్లోనే పడతాయని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఇకపోతే ఉపఖండంలో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వారు ఎంతో దూకుడుగా ఆడుతారని తెలిపాడు. తమ బ్యాటింగ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్లనే విజయం చేజారిపోయిందన్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని తెలిపాడు. ఇక చెన్నై వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌ కచ్చితంగా గెలుస్తామని ఆర్చర్ వెల్లడించాడు. 

Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ బంపరాఫర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు