/rtv/media/media_files/2025/01/19/OMcr7Y3wlfyXpT2xIirf.jpg)
cricket u19 Photograph: (cricket u19)
Women U19 world cup: మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 44 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే ఛేదించింది.
విండీస్ బ్యాటర్లు బెంబేల్..
బయుమాస్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ దారిపట్టారు. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కో్ర్ చేశారు. అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే కాసేపు పోరాడారు. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో సిసోదియా 3, ఆయుషి శుక్లా 2, జోషిత 2 వికెట్లు పడగొట్టారు. టీమ్ ఇండియా బ్యాటర్స్ కమిలిని (16*), సానికా చాల్కే (18*) నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు.