/rtv/media/media_files/2025/02/23/TsCydAuUmzlxqwLh8QSS.jpg)
India Vs Pakistan
క్రికెట్ లో రెండు జట్లు ఎ్పటికీ ప్రత్యర్థులే. వాళ్ళిద్దరి మధ్యా మ్యాచ్ అంటే ఊర్రూతలే. ఎప్పుడు, ఎక్కడ ఆ రెండు దేశాలు తలపడినా...ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం మొదలైన రెండు దేశాల మధ్య తగువు...ఇప్పటికీ ఆటలో కనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు ఏంటో..ఎవరి మధ్య మ్యాచో ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది భారత్, పాకిస్తాన్...ఈ రెండింటి మధ్యా క్రికెట్ మ్యాచ్ అవుతోంది అంటే పెద్ద యుద్ధం జరుగుతోందనే లెక్క. ఏ టోర్నీ అయినా, సీరీస్ అయినా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు నరాలు తెగే ఉత్కఠత ఉండాల్సిందే.
చిరకాల ప్రత్యుర్ధులు..
ఇప్పుడు మళ్ళీ ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈరోజు భారత్, పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చివరి సారిగా రెండు జట్లూ 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో తలపడ్డాయి. అప్పుడు భారత్ ఓడిపోగా..పాకిస్తాన్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దాని తరువాత ఈ రెండు దేశాలు మళ్ళీ ఇప్పుడే తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్ పై భారత్ గెలిచి...గత మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని భారత అభిమానలు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో పాక్‌దే పైచేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మూడు సార్లు పాకిస్థాన్ నెగ్గగా.. రెండుసార్లు మాత్రమే భారత్ విజయం సాధించింది.
అదో పీడకల..
2017 ఫైనల్ మ్యాచ్ అయితే భారత్ కు పీడకలే. జూన్ 18న లండన్ లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కు ఇచ్చింది. అయితే దీన్ని ఛేదించడంలో టీమ్ ఇండియా ఘోరంగా విఫలం అయింది. 158 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటి ఫైనల్ ను ఓటమికి బదులు తీర్చుకోవడానికి భారత్ కు ఇప్పుడు అవకాశం వచ్చింది. గత వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో.. మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈరోజు జరిగే మ్యాచ్ లో టీమ్ ఇండియా కనుక గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్యా ఫలితాల లెక్క 3-3తో సరి అయిపోతుంది.
Also Read: Champions Trophy: వాహ్ ఏమాడారు...352 ను అలవోగ్గా బాదేసిన కంగారూలు