/rtv/media/media_files/2025/03/07/hOFZCaEMJH4Lj0UOGSZI.jpg)
Hardik Pandya 'laughed inside' at tensed Indian dressing room
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. 84 పరుగులతో ఔరా అనిపించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేశాడు. అయితే చివర్లో భారత్ ఓడిపోతుందేమోనన్న భయం అందరిలోనూ కలిగింది.
Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ
కానీ క్రీజ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, హార్ధిక్ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు. కేఎల్ రాహుల్ 42 పరుగులు, హార్దిక్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముఖ్యంగా హార్దిక్ లాస్ట్ కొట్టిన సిక్స్‌లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాదాడు. దీంతో ఆ మ్యాచ్ భారత్‌వైపు తిరిగింది. అయితే హార్ధిక్ క్రీజులోకి అడుగుపెట్టేటప్పుడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్కంఠ నెలకొంది. అక్కడ పరిస్థితుల గురించి మ్యాచ్ అనంతరం హార్ధిక్, అక్షర్ పటేల్ మాట్లాడారు.
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
కాస్త నవ్వుకున్నా
ఈ మేరకు హార్దిక్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనలో తాను కాస్త నవ్వుకున్నానని అన్నాడు. ఇక ఆ మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అస్సలు ఊహించలేదని.. ఆ టైంలో డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ వాతావరణం ఉంటుందని తనకు తెలుసు అని చెప్పుకొచ్చాడు. ఆపై అక్షర్ పటేల్ మాట్లాడాడు. మ్యాచ్ చివరి సమయంలో అందరి ముఖాల్లో కాస్తంత ఆందోళన ఉందని అన్నాడు. హార్దిక్, రాహుల్ ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండాలని అంతా భావించామని తెలిపాడు. కానీ తనకు హార్దిక్‌పై పూర్తి నమ్మకం ఉందని అతడు చెప్పుకొచ్చాడు.
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
ఇక అదే సమయంలో కేఎల్ రాహుల్ మ్యాచ్ సమయంలో క్రీజ్‌లో ఉన్నపుడు తన అనుభవాన్ని వెల్లడించాడు. అత్యంత కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడని రాహుల్ అన్నాడు. అతడు అలా ఆడటం వల్లే తన మీద ఒత్తిడి తగ్గిందని చెప్పుకొచ్చాడు. అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని రాహుల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్ భారత్ vs న్యూజిలాండ్ మధ్య మార్చి 9న అంటే ఎల్లుండి జరగనుంది.