/rtv/media/media_files/2025/04/02/WLzlbND0LFYgDzQf5LR7.jpg)
RCB VS GT
ఆర్సీబీకి మొదటి దెబ్బ పడింది. ఐపీఎల్ 2025 లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 8 వికెట్లతో తేడాతో జీటీ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 169 పరుగులు చేసి గుజరాత్ కు 170 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. లక్ష ఛేదనకు దిగిన జీటీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. 17.5 ఓవర్లలో 170 పరుగులను చేశారు. జీటీ బ్యాటర్ జోస్ బట్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించేశాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ లతో 73 పరుగులు చేసి చెలరేగిపోయాడు. ఏ స్థితిలోనూ కూడా ఆర్సీబీ బౌలర్లు బట్లర్ ను కట్టడి చేయలేకపోయారు. అంతకు ముందు సాయి సుదర్శన్ కూడా ఓ ఊపు ఊపాడు. 48 పరుగులు చేశాడు. ఒపెనర్ శుభ్ మన్ గిల్ మాత్రం కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. సొంత గ్రౌండ్ లో ఆర్సీబీ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా చేతులెత్తేశారు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యటార్లు విఫలమైతే...రెండో దానిలో బౌలర్లు ఫెయిల్ అయ్యారు.
టాస్ గెలిచి బ్యాటాంగ్ చేసి..
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ టాపార్డర్ చేతులేత్తేసింది. గుజరాత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సొంతగడ్డపై ఆర్సీబీ టాపార్డర్ కుప్పకూలింది. మొదటి రెండు మ్యాచ్ లలో పవర్ ప్లే లో భారీగా పరుగులు చేసిన బెంగళూరు బ్యాటర్లు ఈ రోజు మాత్రం కేవలం 36 పరుగులే చేసింది. అది కూడా మూడు వికెట్లు కోల్పోయి మరీ. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ వెంట వెంటనే వికెట్లను పొగొట్టుకుంది. సొంత స్టేడియంలో విరాట్ కోహ్లీ 7, దేవదత్, పటీదార్ ఇలా అందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
లివింగ్ స్టోన్ మెరుపులు..
మొదటి ఓవర్లో ఫోర్ కొట్టి జోష్ నింపిన విరాట్ ఆ తర్వాత సెకండ్ ఓవర్లోనే బ్యాక్ స్వేర్ లెగ్‌లో షాట్‌కు యత్నించిన యంగ్ బౌలర్ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పడిక్కల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వీరిద్దరి తర్వాత వచ్చిన కెప్టెన్ పటీదార్, ఓపెనర్ సాల్ట్ లు ఆచి తూచి ఆడారు. కానీ వరుస ఓవర్లలో వీరిద్దరూ కూడా వికెట్లను సమర్పించుకున్నారు. బెంగళూరు బ్యాటర్లలో లివింగ్ స్టోన్ ఒక్కడే 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇతని తర్వాత జితేశ్ శర్మ 21 బంతుల్లో 33 పరుగులతో రాణించాడు. మొదట్లో ఆచి తూచి ఆడిన స్టోన్ చివర్లో మాత్రం బ్యాట్ ను కాస్త గట్టిగానే ఝుళిపించాడు. రషీద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్సర్లు బాదాడు. రషీద్ వేసిన 16 ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఒక సిక్స్, టిమ్ డేవిడ్ ఒక ఫోర్ బాదారు. సాయి కిశోర్ వేసిన 17 ఓవర్‌లో డేవిడ్ సిక్స్ కొట్టాడు. ఇక, రషీద్ ఖాన్ వేసిన 18 ఓవర్‌లో లివింగ్‌స్టోన్ మూడు సిక్సర్లు బాదేశాడు. మరోవైపు టిమ్ డేవిడ్ కూడా ప్రసిద్ధ వేసిన చివరి ఓవర్ లో వరుసగా 4, 6, 4 బాదాడు. దీంతో ఆర్సీబీ చివరి ఐదు ఓవర్లలో 63 పరుగులు రాబట్ట గలిగింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (3/19) అదరగొట్టాడు. సాయి కిశోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-gt | match
Also Read: USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర