/rtv/media/media_files/2025/03/30/OdO8o2pnoSJuph5RJC1t.jpg)
Shane Warne
ఫేమస్ బౌలర్ షేన్ వార్న్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ అయిన వార్న్ ఎన్నో రికార్డులు సాధించాడు. ఇతను మూడేళ్ల క్రితం ధాయ్ లాండ్ లో చనిపోయాడు. 2022 మార్చి 4న థాయ్‌లాండ్ లోని కోహ్ సమూయి ద్వీపంలోని ఓ విల్లాలో గుండోపోటుతో చనిపోయాడు. అది కూడా సడెన్ గా. అయితే తాజా సమాచారం ప్రకారం సంఘటనా స్థలంలో ఓ కీలకమైన ‘వస్తువు’ తొలగించబడినట్లు బ్రిటన్ మీడియా సంస్థ డైలీ మెయిల్ సంచలన కథనం పబ్లిష్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
డ్రగ్, వాంతులు, రక్తం..
థాయ్ లాండ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షేన్ వార్న్ మరణించిన చోట లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ఓ మందు లభించింది. అయితే హైయ్యర్ అఫీషియల్స్ ఆదేశాల మేరకు వాటిని అక్కడి నుంచి తొలిగించేశారు. అంతేకాదు షేన్ వార్న్ చనిపోయి చోట వాంతులు, రక్తపు మరకలు కూడా ఉన్నాయని...వాటిని కూడా శుభ్రం చేయాలని చెప్పారని అంటున్నారు. వార్స్ అక్కడ దొరికిన మాత్రలను ఎంత మోతాదులో తీసుకున్నారనేది మాత్రం తెలియదని చెబుతున్నారు.
ఇందులో మరో ఆసక్తికరమైన అంశం కూడా బయటపడింది. షేన్ వార్న్ మృతిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. షేన్ వార్న్ మరణించిన తీరు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారొచ్చనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నతాధికారులు దీనిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. షేన్ వార్న్ అస్వస్థతకు గురైనప్పుడు వైద్యులు ఆయన్ను కాపాడ్డానికి ప్రయత్నించారని ...కానీ ప్రాణాలు కాపాడలేకపోయారని థాయ్ లాండ్ పోలీస్ అధికారి ఒకరు చెబుతున్నారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులు గుండెపోటని డిక్లేర్ చేశారని చెప్పారు. అయితే స్థానిక ఆసుపత్రి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వార్న్ ది సహజ మరణమని ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలతో అసలు ఏం జరిగిందనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
today-latest-news-in-telugu | australia | shane-warne | death
Also read: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండచరియలు..ఆరుగురు మృతి