Abhishek Sharma: ఇంగ్లాండ్ - భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం అయింది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ తొలి మ్యాచ్‌ని యువ భారత్ కైవసం చేసుకుంది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ భారత్ ఆటగాడు అభిషేక్ శర్మ అదరగొట్టేశాడు.
Puli is Back #AbhishekSharma ❤️🔥💥 pic.twitter.com/wRiiI0TlA1
— Bhargav Pilli (@Bhargavexe) January 22, 2025
Also Read: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
సిక్సర్లతో చుక్కలు
గ్రౌండ్‌లో సిక్సర్లతో చుక్కలు చూపించాడు. ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టి 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 79 పరుగులు చేశాడు. ఇలా తొలి మ్యాచ్‌లోనే తన విశ్వరూపం చూపించాడు. అయితే బ్యాటింగ్‌లో తాను ఇంత బాగా పెర్ఫార్మ్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు కారణమని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
వారి గురించి గొప్పగా చెప్పాడు. అందులో తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన యువరాజ్ సింగ్ ఉన్నాడని తెలిపాడు. యువరాజ్ సింగ్‌తో ఎప్పటి నుంచో కలిసి వర్క్ చేస్తున్నానని అన్నాడు. అలాగే ఆ తర్వాత బ్రియాన్ లారాతో కూడా వర్క్ చేశానని తెలిపాడు. SRH తరఫున కోచ్‌గా ఉన్నపుడు అతడు చాలా సాయం చేశాడని పేర్కొన్నాడు.
Also Read: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
ABHISHEK SHARMA'S BACK-TO-BACK SIXES TO MARK WOOD..!!!🔥🔥#INDvsENG #AbhishekSharma#CricketTwitter pic.twitter.com/Ba6jacxnWq
— DEEP SINGH (@CrazyCricDeep) January 22, 2025
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
ఇక డానియల్ వెట్టోరి కోచింగ్‌లో సైతం బాగా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నానని చెప్పుకొచ్చాడు. అతడు స్వేచ్ఛగా ఆడమని చెప్తాడని.. దానిని పెద్ద పెద్ద షాట్లు కొట్టేటప్పుడు పాటిస్తానని అన్నాడు. ఇక యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా తర్వాత ఇప్పుడు గౌతమ్ గంభీర్ సూచనలు తనపై ప్రభావం చూపుతున్నాయని తెలిపాడు. తాను ఎలా ఆడినా గంభీర్ తనకు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.