Dhoni-Gambhir: ధోనీ అంటే గంభీర్‌కు నచ్చదా.. ఈ కోచ్ చెప్పింది నిజమేనా?

ధోనీ, గంభీర్ మధ్య వివాదాలున్నట్లు వస్తున్న వార్తలపై గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్‌ భరద్వాజ్‌ క్లారిటీ ఇచ్చాడు. 'గౌతికి కోపం ఎక్కువే. కానీ అది మైదానం వరకే. అందరిపట్ల ప్రేమగా ఉంటాడు. ఎవరిని శత్రువుగా చూడడు. దేశం కోసం ఏదైనా త్యాగం చేయాలంటాడు' అని చెప్పాడు. 

New Update
gambir dhoni

Dhoni, Gambhir

Gambhir: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్ మధ్య వివాదాలున్నట్లు చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ధోనీ అంటే గంభీర్‌కు పడదనే కామెంట్స్‌పై గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్‌ భరద్వాజ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్‌.. నిజానికి గంభీర్ ను అందరూ తలతిక్కవాడుగా భావిస్తారన్నారు. కానీ దేశం కోసం ఆడుతున్నపుడు గౌతిలో చాలా నిబద్ధత ఉంటుందని చెప్పాడు. 

దేనిని మనస్సులో పెట్టుకోడు..

‘గౌతమ్ గంభీర్‌ అందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఎవరిని శత్రువుగా చూడడు. ఇదే నిజం. కానీ చాలామంది ధోనీ అంటే గంభీర్‌కు ఇష్టం లేదనే అంటుంటారు. విరాట్ విషయంలోనూ అలాగే మాట్లాడుకుంటారు. కానీ గౌతికి ఎవరిమీదా వ్యక్తిగత కోపం లేదు. ఉండదు. దేనిని మనస్సులో పెట్టుకోడు. 2004లో ఇండియా Aసిరీస్‌ జరిగినపుడు ధోనీ-గంభీర్‌ మధ్య గొడవ జరిగినట్లు చెబుతుంటారు. 

ఇది కూడా చదవండి: Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న!

అదంతా పుకారే. ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరూ రూమ్ మెట్స్. ఐపీఎల్‌ లో కోహ్లీతో వాగ్వాదం గురించి నాతో చర్చించాడు. అక్కడ ఏది సరైనదో మీకు, అందరికీ తెలుసన్నాడు. జట్టు సభ్యుల కోసం గంభీర్ ఎంతవరకైనా వెళ్తాడు. మొత్తంగా ఏది జరిగినా గ్రౌండ్ వరకే పరిమితం చేస్తాడు' అని సంజయ్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ ..  మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు

ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

New Update
siraj 100

siraj 100

ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. -ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు.  సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు..  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా  సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 6 ఓవర్లకు గానూ రెండు కీలక మైన 2 వికెట్ల కోల్పోయి 45 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (2), ఇషాన్ కిషన్ (15) క్రీజులో ఉన్నారు.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

జట్లు ఇవే 

సన్‌రైజర్స్ హైదరాబాద్ :  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్ :  సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Advertisment
Advertisment
Advertisment