Karun Nair: నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సంచలన కామెంట్స్!

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్‌ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు. 

author-image
By srinivas
New Update
karan

Delhi batsman Karan Nair sensational comments

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్‌ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు. 

Also Read :  మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఆరంభంనుంచే అటాక్..

ఈ మేరకు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్‌ నాయర్ ఆరంభంనుంచే అదరగొట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్టు 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ విజయం ఖాయంగానే కనిపించింది. కానీ చివర్లో వరుస వికెట్లుపడటంతో ఓటమిపాలైంది. దీంతో గెలుపువాకిట నిలిచిన మ్యాచ్ ముంబై లాగేసుకోవడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు. 

Also Read :  వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ

Also Read :  'జాగ్రత్త.. మీ వాట్సాప్‌ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కరణ్‌.. ‘నా ఇన్నింగ్స్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పినా పెద్దగా ఉపయోగం లేదు. అద్భుత ప్రదర్శన చేసినా ఓటమి బాధించింది. ముఖ్యంగా నా ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయింది. ఓడినప్పుడు ఎంత గొప్ప ఇన్నింగ్స్‌ అయినా వేస్ట్. అవకాశం వచ్చినా ప్రతిసారి నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటున్నా. పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కాబట్టి నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టాను. అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్‌ పరంగా  హ్యాపీగానే ఉన్నా. విజయం దక్కితే మరితం సంతోషంగా ఉండేది' అంటూ చెప్పుకొచ్చాడు. 

Also Read :  రాజగోపాల్ రెడ్డి బాటలో మరో ఎమ్మెల్యే.. నాకే మంత్రి పదవి రాకుంటే.. వీడియో వైరల్!

today telugu news | telugu-news | IPL 2025 | mi-vs-dc | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు