/rtv/media/media_files/2025/03/28/i33VPIZRuRIjn0oiaHek.jpg)
CSK VS RCB
ప్రస్తుతం జరుగుతున్న IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025లో 8వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 28న అంటే ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. CSK - RCB జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలుపొందాయి. దీంతో ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అదీగాక ఈ రెండు జట్లు బలంగా ఉండటంతో క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి పెరిగిపోతుంది.
RCB ఈ సీజన్‌లో తమ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడి ఘన విజయాన్ని సాధించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు
ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2008 నుండి చెన్నైలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో విజయం ఎవరి సొంతం అవుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా IPL 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లో వారు మంచి ప్రదర్శన చేశారు. మరోవైపు చెన్నై జట్టులో నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్పిన్నింగ్ ప్రదర్శతో అదరగొట్టేస్తున్నారు. చూడాలి మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుపొందుతుందో. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్లేయర్లను ప్రకటిచారు.
చెన్నై సూపర్ కింగ్స్
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (సి), రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, దీపక్ హుడా, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికె), ఆర్.అశ్విన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్ ఉన్నారు.
Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.
(csk-vs-rcb | latest-telugu-news | telugu-news | ipl-2025 )