/rtv/media/media_files/2025/03/04/noPTWarrTPIOezxlWTO4.jpg)
టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ (Shama Mohamed) చేసిన కామెంట్స్ సంచనలంగా మారాయి. రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. ఈ క్రమంలో ఆమె కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. బీజేపీతో పాటుగా సొంత పార్టీలోని కొంతమంది నాయకులు, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Also Read : విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ఆరేళ్ల క్రితం ట్వీట్
అయితే షామా మహమ్మద్ ఒక క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. తనకు విదేశీ క్రికెటర్లు ఇష్టమన్న ఓ అభిమానిపై విరాట్ కోహ్లీ2018లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని, భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటని కోహ్లీ ప్రశ్నించాడు. ఇతర దేశాల వారు నచ్చినప్పుడు భారత్ లో ఉండాల్సిన అవసరం లేదంటూ కోహ్లీ అప్పట్లో అన్నాడు.
Also Read : KKR కొత్త కెప్టెన్ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ
Also Read : అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL!
దీనికి షామా మహమ్మద్ స్పందిస్తూ.. " కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడుతున్నాడు. విదేశాల బ్రాండ్స్ కు ఎండార్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తాడు. ఇటలీలో పెళ్లి చేసుకున్నాడు. గిబ్స్ ఆయన అభిమాన క్రికెటర్. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ . కానీ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌లను ఇష్టపడే వ్యక్తులు ఇండియాలో నివసించకూడదని అంటాడు " అంటూ షామా ఆరు సంవత్సరాల క్రితం చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాత ట్వీట్ ను వైరల్ చేస్తూ కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈమెకు ఇండియన్ క్రికెటర్స్ తో ఉన్న ఇబ్బంది ఏంటో ఆర్థం కావడం లేదంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Also Read : Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?