/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)
Bcci
Team india: టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. గంభీర్ కోచ్ పదవి చేపట్టినప్పటినుంచి శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. జట్టులోకి వచ్చిన జూనియర్లు పర్వాలేదనిపించినా సీనియర్ ఆటగాళ్లు మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీసీసీఐ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణలేమిపై యాక్షన్..
ఈ మేరకు ఆటగాళ్లు కుటుంబంతో వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకు.. క్రమశిక్షణలేమి వంటి అంశాలను బోర్డు పరిశీలించనుంది. ఇందులో భాగంగానే బీసీసీఐ కొవిడ్ ముందున్న నిబంధనలను మళ్లీ అమలుచేయనుంది. ఫ్యామీలీలతో ఆటగాళ్లు రెండు వారాల కంటే ఎక్కువ ఉండటానికి కుదరదు. సరిగా ఆడని ప్లేయర్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించనుంది. దేశవాళీ, జాతీయ క్రికెట్ లో తప్పనిసరి ఆడాలి. లేదంటే జట్టునుంచి పక్కనపెట్టడమేనని బీసీసీ అధికారిక ఒకరు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్వదేశంలో జరిగే అన్ని మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను విడుదల చేసింది. ఇందులో టికెట్ రూ.1000గా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత్ లో రూ. 310లతో సమానం అన్నమాట. ఇది నిజంగా అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి. ఇవే భారత్ లో అయితే రూ. 2 వేలకు పైగానే ఉంటాయి.
పాకిస్తాన్ బోర్డు తన హోమ్ మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను మాత్రమే విడుదల చేసింది. అంటే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను మాత్రమే విడుదల చేసిందన్నమాట. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడాల్సి ఉంది. ఇక్కడ సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఈ మ్యాచ్‌ల టికెట్ ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల ధర ఎంత ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది. అయితే పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు టిక్కెట్ ధర రూ. 2000 (భారత్ లో రూ. 620) గా ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరగనుంది.