/rtv/media/media_files/2025/03/22/nQeXHIOEQzFrm1gzGRNm.jpg)
Uppal Stadium, Hyderabad
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీటికి 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప్పల్ స్టేడియం బయట, లోపల 450 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటూ స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, స్ప్రేలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలను అనుమతించమని సుదీర్ బాబు చెప్పారు.
అర్ధరాత్రి వరకు మెట్రో ట్రైన్స్..
ఇక క్రికెట్ కు వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో ట్రైన్స్ ను కూడా వీలుగా తిరిగేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచ్ అయ్యాక అర్ధరాత్రి తిరిగి వెళ్ళేలా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో ఈ ఆదివారం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కు ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిన్న మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ టోర్నమెంట్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది . ఇందులో పది జట్లు పోటీ పడుతున్నాయి. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ,స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
today-latest-news-in-telugu | ipl-2025 | hyderabad | uppal-stadium
Also Read: TS: మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్