Special Scheme For Women : ఉచిత శిక్షణ.. రూ.10వేల వేతనం.. మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!

నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళలకు డ్రోన్లను ఎగురవేసేందుకు శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత పనులకు శిక్షణ ఇవ్వనుంది. డ్రోన్ సఖిగా ఎంపికైన మహిళకు 15 రోజుల పాటు శిక్షణతో పాటు రూ.15 వేల వేతనం కూడా ఇస్తారు.

New Update
Special Scheme For Women : ఉచిత శిక్షణ.. రూ.10వేల వేతనం.. మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!

Free Training For Women's : దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిలో మహిళల సాధికారత కోసం భారత ప్రభుత్వం(Indian Government) అనేక గొప్ప పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం మహిళల (Women's) కోసం ఓ అద్భుతమైన పథకాన్ని ఇటీవలే తీసుకొచ్చింది. ఈ పథకం పేరు నమో డ్రోన్ దీదీ పథకం. నమో డ్రోన్ దీదీ పథకం(Namo Drone Didi Scheme) భారత ప్రభుత్వం చేసిన వినూత్న ప్రయత్నం. ఈ పథకం కింద డ్రోన్లు ఎగరడం, డేటా అనాలిసిస్, డ్రోన్ల నిర్వహణపై మహిళలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు వ్యయాన్ని తగ్గించి దిగుబడిని పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇక ఏయే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం.

నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళలకు డ్రోన్లను ఎగురవేసేందుకు శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత పనులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15 వేల మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద 10 నుంచి 15 గ్రామాల క్లస్టర్లో ఒక మహిళను డ్రోన్ సఖిగా ఎంపిక చేస్తారు. డ్రోన్ సఖి (Drone Saki) గా ఎంపికైన మహిళకు 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు.

డ్రోన్ల ద్వారా పొలాల్లో యూరియా, పురుగుమందు పిచికారీ చేస్తారు. దీంతోపాటు మహిళలకు రూ.15 వేల వేతనం కూడా ఇవ్వనున్నారు.

దిగువ ఆర్థిక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళలకు ఈ పథకం ప్రయోజనాన్ని అందించనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు ఉండాలి.

Also Read : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి..దంత సమస్యలకు చెక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment