Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా?

రోజూ 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం, జీవక్రియ రేటును తగ్గం, శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

New Update
Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా?

Smoking Kills Health : ధూమపానం(Smoking) క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని మనందరికీ తెలుసు. కానీ మన ఆధునిక జీవనశైలిలో మనం నిర్లక్ష్యం చేస్తున్న మరో ప్రమాదకరమైన అలవాటు కూడా ఉంది. కంప్యూటర్లు, డెస్క్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసే డిజిటల్ యుగం(Digital Era) ఇది. రోజూ 10 నుంచి 12 గంటలు కూర్చోవడం, ఆఫీసులో పని చేయడమే కాదు టీవీ చూడటం లేదా సోషల్ మీడియా(Social Media) లో గడపడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో వివిధ రకాల క్యాన్సర్(Types Of Cancer) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం పడుతుందని, జీవక్రియ రేటును తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ క్యాన్సర్ పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి.

ఎక్కువసేపు కూర్చుంటే:

  • ఎక్కువసేపు కూర్చోవడం(Continue Sitting) వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ:

  • ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో రక్త ప్రసరణ సరిగా జరగదు. కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

వైద్యులు ఇచ్చే సలహా:

  • నిత్యం నడక(Walking), వ్యాయామం(Exercise) చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కూర్చొని పని చేస్తూనే లేచి మధ్యలో కొంచెం నడవాలని, అలాగే రోజూ కొంత వ్యాయామం లేదా యోగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : పిల్లలు బక్కగా ఉన్నారా? సెమోలినాతో ఇలా చేస్తే బొద్దుగా..పొడుగ్గా కావడం గ్యారెంటీ

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్‌..ఇలా చేసుకోండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్‌), శ్రీకాంత్‌.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్‌.వెంకట్, డి.దిలీప్‌.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, ఫీడ్‌ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment