isreal, palestina conflict:హమాస్ అరాచకం..మహిళను చంపి, ట్రక్కు మీద నగ్నంగా ఊరేగించి..

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం సామాస్య ప్రజల చావుకొచ్చింది. ఇజ్రాయెల్ లో మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన విదేశీయులను సైతం పాలస్తీనా మిలిటెంట్లు వదిలిపెట్టలేదు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంత మీద రాకెట్లతో దాడులు చేయడమే కాకుండా...ఎగ్జిట్ ద్వారా దగ్గర పొంచి ఉండి మరీ అందరినీ హతమార్చారు. ఇందులోనే ఓ మహిళను చంపి ఆమె శవాన్ని పికప్ ట్రక్కుకి కట్టి నగ్నంగా ఊరేగించారు.

New Update
isreal, palestina conflict:హమాస్ అరాచకం..మహిళను చంపి, ట్రక్కు మీద నగ్నంగా ఊరేగించి..

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు రెండోసారి దాడులకు పాల్పడ్డారు. మొదటిసారి దాడులు చేసినప్పుడు వారు ఓ మహిళను చంపి, ఆమె శవాన్ని పికప్ ట్రక్కుకి కట్టి.. నగ్నంగా ఊరేగించారు. ఈమె జర్మనీకి చెందిన షనీ లౌక్ (Shani Louk) అని తెలుస్తోంది. షనీ జర్మనీలోని ఓ టాటూ ఆర్టిస్ట్. ఆమె శరీరంపై ఉన్న టాటూలను బట్టీ.. సోషల్ మీడియా యూజర్లు ఆమెను షనీ లౌక్‌గా గుర్తించారు. షనీ లౌక్ సోషల్ మీడియాలో ఫేమస్. ట్రక్కు మీద ఉన్న ఫోటోల్లో కూడా అవే టాటూలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. షనీ తల్లి కూడా ఈ విషయంపై స్పందించారు. తన 30 ఏళ్ల కూతురు.. ఓ పర్యాటక బృందంతో ఇజ్రాయెల్ వెళ్లిందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో తన కూతురు నగ్న వీడియోని చూసిన ఆమె... చనిపోయింది తన కూతురు లాగానే ఉందని తెలిపారు. మరింత సమాచారం కావాలనీ, హెల్ప్ చెయ్యాలని కోరారు. షనీ తల్లి వీడియో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఇక షనీ కజిన్ టొమాసినా కూడా ఆ నగ్న వీడియోలో ఉన్నది షనీయే అని తెలిపారు. కానీ ఆమె షనీ కాకపోతే బాగుండని కోరుకున్నారు.
shani, hamas
షనీ లౌక్ హత్యను సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కి షనీ వచ్చింది. హమాస్ ఉగ్రవాదులు మొన్న దాడి జరిపిన మొదటి ప్రాంతాల్లో ఆ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రదేశం కూడా ఉంది. అక్కడ చాలా మందిని వారు చంపేశారు. అపార్ట్‌మెంట్లలోకి చొరబడి మరీ హత్యలు చేశారు. ఆ క్రమంలోనే షనీ లౌక్‌ని చంపేశారని తెలుస్తోంది.

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య వార్ అంతకంతకూ పెరిగిపోతోంది. హమాస్ మిలిటెంట్లు నరమేధం చేస్తున్నారు. ఇళ్ళల్లోకి చొరబడి మరీ ప్రజల్ని చంపేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతం లాక్కుని బంధిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 1100 మంది మృతి చెందారు. దాదాపు 2వేల మంది వరకు గాయపడ్డారు. వందల మంది బందీలుగా ఉన్నారు.

Also Read:అవి వాడాలంటే యాడ్స్ భరించాలి లేదా డబ్బులు కట్టాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు