Hyderabad: శంషాబాద్‌ లో ఘోర ప్రమాదం.. కల్వర్టు గుంతలో పడిన వాహనాలు

శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.

New Update
Hyderabad: శంషాబాద్‌ లో ఘోర ప్రమాదం.. కల్వర్టు గుంతలో పడిన వాహనాలు

Shamshabad: పండుగపూట శంషాబాద్‌ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సంబరాలను తమ కుటుంబంతో జరుపుకునేందుకు సొంత గ్రామానికి వెళ్తున్న వారిని రోడ్డు మరమ్మతుల కోసం తవ్విన గుంత బలితీసుకుంది. ఈ దారుణమైన ఘటన స్థానికులను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివారాలు ఇలా ఉన్నాయి.

కారు ఢీ కొట్టడంతో..
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని గున్సిమియాగూడ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళ్తున్న స్విప్ట్ కారు (CAR) ఆటో (AUTO) బైక్ (BIKE)ను ఢీ కొట్టింది. దీంతో మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడ్డాయి. దీంతో కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ తోపాటు బైక్ పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలవగా వెంటనే స్థానికి ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్ లో కారు బోల్తా.. 
అలాగే ఇదే రోజు కరీనంగర్  జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ఇండికా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Chain Snatcher: లవ్ బర్డ్స్ కాదు.. దంపతులే: చైన్ స్నాచింగ్ లో నయాట్రెండ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment