IPL-2024 : రికార్డుల మోత మోగించిన రాయల్ ఛాలెంజర్స్ vs సన్ రైజర్స్ మ్యాచ్

ఐపీఎల్ 2024 ఒక ఎపిక్. మొదట నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డ్ బద్ధలవుతూనే ఉంది. నిన్నటి ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. ఈ మ్యాచ్ ఒక విధ్వంసం. ఇందులో రెండు టీములు సంయుక్తంగా రికార్డులు బద్ధలుకొట్టారు.

New Update
IPL-2024 : రికార్డుల మోత మోగించిన రాయల్ ఛాలెంజర్స్ vs సన్ రైజర్స్ మ్యాచ్

RCB vs SRH : ఐపీఎల్ 17 సీజన్(IPL 17 Season) లో నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్‌ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతో పాటూ ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా హైదరాబాద్ జట్టు నిలిచింది.

హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. మరోవైపు ఆర్సీబీ కూడా అద్‌బుత పోరాట పటిమను చూపించింది. సన్ రైజర్స్ జట్టు 287 అత్యధిక పరుగులు చేస్తే రాయల్ ఛాలెంజర్స్ 262 పరుగులు చేసింది. మొత్తం 40 ఓటర్లలో ఇరు జట్లూ కలిసి పరుగుల వడగళ్ళ వాన కురిపించారు. ఒక మ్యాచ్‌లో 549 పరుగులు రాబట్టారు. ఇందులో ఎక్కువ స్కోరు బౌండరీల ద్వారానే వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు రెండు జట్లూ కలిసి మొత్తంగా 81 బౌండరీలు సాధించారు. ఇదొక ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క ఐపీఎల్‌లోనే కాదు మొత్తం టీ20 చరిత్రలోనే ఇది పెద్ద రికార్డ్. నిన్నటి మ్యాచ్‌లో 81 బౌండరీలు..అందులో 43 ఫోర్లు, 38 సిక్సులు ఉన్నాయి. దీని తర్వాత స్థానంలో సెంచూరియన్‌లో జరిగిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా(South Africa) మ్యాచ్ రెండో స్థానంలో ఉంది. ఇందులో మొత్తం 46 ఫోర్లు, 35 సిక్సులు బాదారు. ఇక మూడవ స్థానంలో ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ రావల్పిండి మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు 45 ఫోర్లు, 33 సిక్సులు కొట్టారు.

టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగులు...

ముందే చెప్పుకున్నట్టుగా నిన్నటి మ్యాచ్‌లో సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ కలిపి మొత్తం 549 పరుగులు సాధించారు. ఇప్పటివరకు టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. దీని తర్వాత స్థానాల్లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇదే ఐపీఎల్‌లో జరిగిన మ్యాచ్ రెండవ స్థానంలో నిలిచింది. అందులో రెండు జ్టలూ కలిసి 523 పరుగులు చేశాయి. ఇక మూడవ స్థానంలో 2023లో సెచూరియన్‌లో జరిగిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నిలిచింది. ఇందులో 517 పరుగులు రాబట్టారు. నాల్గవ స్థానంలో ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ రావల్పిండి 2023 మ్యాచ్‌లో 515 పరుగులు, ఐదవ స్థానంలో సర్రే vs మిడిల్‌సెక్స్ ది ఓవల్ 2023 మ్యాచ్‌లో 506 పరుగులు ఉన్నాయి.

సూపర్ సిక్సర్లు...

ఇక నిన్నటి మ్యాచ్‌లో సిక్సర్ల వరద కూడా పారింది. రెండు జట్లూ ఎడాపెడా సిక్స్‌లు బాదేశారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ జట్టలుఓ ట్రావిస్ హెడ్(Travis Head), హెన్రిచ్ క్లాసెన్‌లు ఇద్దరూ అత్యధికంగా 22 సిక్స్‌లు తరలించారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డ్ వీరిద్దరి పేరు మీదనే ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో హెడ్, క్లాసెన్ కలిసి ఇదే ఆర్సీబీ మీద 21 సిక్సులు బాదారు. ఇప్పుడు దాన్ని బీట్ చేశారు.

ఐపీఎల్‌లో టాప్‌ సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌లు...
22 — SRH vs RCB బెంగళూరు 2024
21 — RCB vs PWI బెంగళూరు 2013
20 — RCB vs GL బెంగళూరు 2016
20 — DC vs GL ఢిల్లీ 2017
20 — MI vs SRH హైదరాబాద్ 2024

పైన చెప్పింది జట్టుల వారీగా బాదిన సిక్సర్ల రికార్డ్. అదే ఒక మ్యాచ్‌లో మొత్తంగా రెండు జట్లూ కలిపి బాదిన సిక్సర్ల రికార్డులు చూసుకుంటే అవి ఇలా ఉన్నాయి.

38 — SRH vs MI హైదరాబాద్ 2024
38 — SRH vs RCB బెంగళూరు 2024 *
37 — బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వాన్ షార్జా 2018
37 — జమైకా తల్లావాస్ vs సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ బాసెటెర్రే 2019

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు...

నిన్నటి మ్యాచ్‌లో జట్టు పరంగా అత్యధిక స్కోరు రికార్డ్ కూడా నమోదయింది. ఇంతకు ముందు హైదరాబాద్ సన్ రైజర్స్ ఇదే ఐపీఎల్‌లో ముంబై జట్టు మీద 277 పరుగులు చేసింది. దీన్ని నిన్నటి మ్యాచ్‌లో బద్ధలు కొడుతూ అత్యధికంగా 287 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పటి వరకు ఐసీఎల్‌లో ఇదే టాప్ స్కోర్ రికార్డ్..

ఐపీఎల్‌లో అత్యధిక మొత్తంలో స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌లు

287/3 — SRH vs RCB బెంగళూరు 2024
277/3 — SRH vs MI హైదరాబాద్ 2024
272/7 — KKR vs DC వైజాగ్ 2024
263/5 — RCB vs PWI బెంగళూరు 2013
257/7 — LSG vs PK మొహాలి 2023

ఇక మొత్తం టీ20 టోర్నమెంట్లు(T20 Tournaments) అన్నీ కలిపి చూసుకుంటే నిన్నటి మ్యాచ్‌ రెండవ స్థానంలో నిలుస్తుంది. అంతకు ముందు 2023లో నేపాల్ vs మంగోలియా హాంగ్‌జౌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 314 పరుగులు అత్యధికంగా నమోదు చేయబడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ టాప్ ప్లేస్‌లో నలిచింది. దీని తరువా నిన్నటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిని మ్యాచ్ 287 పరుగులతో రెండవ స్థానంలో నలిచింది. ఇక మూడవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ vs ఐర్లాండ్ డెహ్రాడూన్ 2019లో జరిగిన మ్యాచ్‌లో 278 పరుగులు వచ్చాయి.

Also Read:Bhadrachalam: భద్రాచలం రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు

Advertisment
Advertisment
తాజా కథనాలు