IPL-2024 : ఏంటో ఈ ఐపీఎల్.. అంతా తారుమారు అవుతోంది

మొదటి నుంచి వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఓడిపోతూ వస్తున్న ఆర్సీబీ అనూహ్యంగా అద్భుతంగా ఆడి గెలుస్తుంటే...మొదటి నుంచి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఎఆర్‌హెచ్ రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయి డల్ అయిపోయింది.

New Update
IPL-2024 : ఏంటో ఈ ఐపీఎల్.. అంతా తారుమారు అవుతోంది

RCB : బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్...స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్న ఈజట్టు ఐపీఎల్(IPL) మొదలైన దగ్గర నుంచి వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ వస్తోంది. కోహ్లీ ఎంత బాగా ఆడినా..డుప్లెసిస్ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించినా.. మ్యాచ్‌లను మాత్రం గెలవలేకపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఎంతలా అంటే ఏం చేసినా ఆ జట్టు సంగతి ప్లే ఆఫ్స్ సరి అన్నట్టుగా. అలాంటి గత రెండు మ్యాచ్‌లుగా ఆర్సీబీ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా హైదరాబాద్(Hyderabad), గుజరాత్‌లాంటి బలమైన టీమ్‌ల మీద గెలిచి సత్తా చాటుతోంది. ఇప్పుడు ఎంత గెలిచానా పెద్ద ఉపయోగం లేకపోయినప్పటికీ ప్లే ఆఫ్స్ నుంచి గౌరవప్రదంగా తప్పుకునేలా ఆడుతుననారు ఆర్సీబీ ప్లేయర్స్.

అలా ఎలా సాధ్యమైందిరా నాయనా..
మొత్తం ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆడిన మ్యాచ్‌లు అన్నీ ఒక ఎత్తు అయితే నిన్న గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) తో ఆడిన మ్యాచ్ ఒక్కటీ ఒక ఎత్తు. అందులోనూ విల్ జాక్స్ ఆడిన తీరు అయితే అద్భుతమనే చెప్పాలి. కేవలం 10 బంతుల్లో 50 రన్స్ చేసి ఏంట్రా నాయానయా ఈ బ్యాటింగ్ అనిపించేశాడు విల్ జాక్స్. మొదట 41 బంతుల్లో సెంచరీ సాధించిన అతను.. 50 నుంచి 100 పరుగుల మార్క్‌ చేరుకొనేందుకు మాత్రం కేవలం 10 బంతులనే తీసుకున్నాడు. రషీద్ కాన్ బౌలింగ్‌లో ఏకంగా నాలుగు సిక్స్‌లు బాదేసి పరుగుల వీరుడు అనిపించుకున్నాడు. మొత్తానికి విల్ జాక్స్ ఒక సరికొత్త ఆల్‌ టైమ్ రికార్డ్ సాధించాడు. ఇతనికి తోడు విరాట్ కోహ్లీ 70 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆర్సీబీ గెలుపుకు బాటలు వేసింది. ఆర్సీబీకి ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉననాయి.. ఆటీమ్ కనుక ఇలాగే ఆఆడితే సీజన్‌ను గౌరవప్రదంగా ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లు బెంగళూరు ఖాతాలోకి వస్తాయి. ఇతర జట్ల సమీకరణాలతో ప్లేఆఫ్స్‌ అవకాశమూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వరుసగా ఓడిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్
ఐపీఎల్‌లో ఈసారి సంచలన జట్టు ఏదైనా ఉంది అంటే అది ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రమే. భారీ స్కోర్లు కొడుతూ క్రికెట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్న హైదరాబాద్ గత రెండు మ్యాచ్‌లు ఓడిపోయి డీలా పడిపోయింది. అద్భుతాలు చేస్తుంది అనుకున్న జట్టు సొంత గ్రౌండ్ లోనే చతికిలపడిపోయింది. లాస్ట్ టైమ్‌ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టుతో ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 78 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాంటిగ్ ఎంచుకోకపోవడమే మేము చేసిన తప్పు అని సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నారు. రెండు మ్యాచ్‌లలోనూ ఎస్‌ఆర్హెచ్‌ ఇదే తప్పు చేసింది. ఈ టీమ్ మొదట బ్యాటింగ్ చేసిన ప్రతీసారి గెలుస్తోంది. అదే లక్ష్య ఛేధనలో మాత్రం బాగా తడబడుతోంది. మిగతా మ్యాచ్‌లలో అయినా సన్ రైజర్స్ తిరిగి పుంజుకోకపోతే భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుంది. ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి.. ఐదింటిలో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచులలో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.

Also Read:Andhra Pradesh: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించామని తెలిపారు.

New Update
Batti Vikramarka

Batti Vikramarka

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతను పెంచడమే లక్ష్యంగా.. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (HCSC) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్‌ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌) సమ్మిట్‌కు భట్టి విక్రమార్క హాజరయ్యారు. 

Also Read: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' స్త్రీలకు సమాన హక్కులు అందించి, రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేద్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాల సాధికారిత కల్పించాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా మహిళల్ని భాగస్వాములను చేస్తున్నాం. సోలార్ రంగంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. 

Also Read: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తయారు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తే మహిళ సాధికారత సాధ్యం అవుతుంది.దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని'' భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇంకా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. 2024లో హైదరాబాద్‌లో 250 రేప్ కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం అందించేందుకు షీ టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

 telugu-news | rtv-news | batti-vikramarka | telangana 

Advertisment
Advertisment
Advertisment