/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-59-jpg.webp)
SRH Vs LSG IPL 2024: ఐపీఎల్ 2024లో ఇవాళ హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు రాత్రి ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) 7.30కు మ్యాచ్ మొదలవుతుంది. నిజానికి ఈ మ్యాచ్ రెండు జట్లకూ చాలా కీలకం. హైదరాబాద్, లక్నో రెండూ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఈ మ్యాచ్‌లో గెలిస్తే వాళ్ళకు అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు ఛాన్స్ తగ్గిపోతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలా అయినా గెలిచి తీరాలని ఇరు జట్లూ పట్టుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ మీద మేఘాలు కమ్ముకున్నాయి.
Heavy rain at the Uppal Stadium in Hyderabad. 🌧️pic.twitter.com/zSpSvmMSiK
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2024
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న సాచయంత్రం నుంచి రాత్రి వరకు ఇక్కడ వర్షం భీభత్సంగా పడింది. దీని కారణంగా ఉప్పల్ స్టేడియం అంతా నీటితో నిండిపోయింది. గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కానీ నిన్న పడిన వర్షాన్ని కవర్లు ఆపలేకపోయాయి. దీంతో పిచ్ మొత్తం తడిపిసోయింది. గ్రౌండ్ నిండా వాటర్ ఉండి పోయింది. దానికి తోడు ఇవాళ కూడా హైదరాబాద్‌లో వర్షం పడొచ్చని చెబుతోంది వాతావరణ శాఖ. ప్రస్తుతానికి కాస్త ఎండ వచ్చినా సాయంత్రానికి ఆకాశం మేఘా వృతం అవుతుందని... వర్షం పడుతుందని ప్రెడిక్షన్స్ చెబుతున్నాయి. ఇప్పటికే గ్రైండ్‌ఓల ఉన్న నీళ్ళను ఎలా క్లియర్ చేయాలో తెలియడం లేదు. ఎంత క్లీన్ చేసినా మైదానం తడిగానే ఉండే అవకాశాలున్నాయి. దానికి తోడు వర్షం కూడా పడితే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేయాల్సిందే. అప్పుడు సన్ రైజర్స్ (Sun Risers Hyderabad), జెయింట్స్...రెండు జట్లకూ చెరో పాయింట్ సమానంగా పంచేస్తారు. దాంతో ఇరు జట్ల ఖాతాలలో 13 పాయింట్స్ ఉంటాయి. పట్టికలో చెన్నైని వెనక్కి నెట్టి 3, 4 స్థానాలకు చేరుకుంటాయి. అప్పుడు ప్లే ఆఫ్స్ రేసుమరింత క్లిష్టంగా మారుతుంది. లాస్ట్ మినిట్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్‌కు వెళతారో తెలియదు.
Sunrisers battle Lucknow Super Giants in a must-win clash! pic.twitter.com/jHGVj6tRZn
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 7, 2024
మరోవైపు మ్యాచ్ రద్దు అయితే టికెట్లు కొనుక్కున్న వారు, అభిమానులు కూడా భారీగా నిరాశ చెందుతారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ అద్భుతంగా ఆడి కనువిందు చేసింది. ఈ సారి కూడా అవే హోప్స్‌తో చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇవాళ మ్యాచ్ కానీ జరగకపోతే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశ చెందుతారు.
Also Read:IPL2024: ప్లే ఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్..బ్యాటింగ్ లో విరుచుకుపడిన ఢిల్లీ బ్యాటర్స్..