Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ. By Manogna alamuru 13 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rahul Gandhi: గత కొంతకాలంగా జనాలతో మమేకమైపోతున్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఎక్కడికి వెళ్ళినా సామాన్య మనుషుల్లా ప్రవర్తిస్తూ...అందరితో కలిసిపోతూ తిరుగుతున్నారు. భారత్ జోడో యాత్రలో కూడా ఇదే చేశారు. బౌక్ నడిపారు, పొలం దున్నారు, స్విగ్గీ బండి మీద ట్రావెల్ చేశారు...ఇలా ఎన్నో. సేమ్ ఇలాగే చెన్నైలో కూడా కాసేపు హల్చల్ చేశారు రాహుల్ గాంధీ. అక్కడ ఒక స్వీట్ షాప్‌కు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడానికి వెళ్ళారు రాహుల్ గాంధీ. వెళుతూ వెళుతూ వుత్త చేతులతో వెళ్ళడం ఎందుకని స్వీట్స్ కొనుక్కుని తీసుకువెళ్ళారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఎవరికైనా ఏమైని ఇవ్వాలంటే...తమ కింద వారి చేత తెప్పించుకుంటారు. కానీ రాహుల్ గాంధీ అందరి కంటే భిన్నం. స్టాలిన్‌కు స్వీట్స్ తనే స్వయంగా కొన్నారు. దాని కోసం మామూలు వ్యక్తుల్లా రోడ్డు దాడి మరీ స్వీట్ షాప్‌కు వెళ్ళారు. అక్కడ టేస్ట్ చేసి మరీ మైసూర్‌పాక్‌ను కొన్నారు. రాహుల్‌తో ఫోటోలు దిగిన వర్కర్లు.. రాహుల్ గాంధీ రాకతో విఘ్నేశ్వర స్వీట్స్‌లో కాసేపే సందడి నెలకొంది. అకకడ ఆయన ప్రతీ స్వీటును పరిశీలించారు. కొన్నింటిని టేస్ట్ చేశారు. షాపు యజమాని రాహుల్‌కు తమ ప్రత్యేక స్వీట్ల రుచి చూపించారు. దాంతో పాటూ అక్కడ పని చేస్తున్న వర్కర్లతో ఫోటోలు దిగారు రాహుల్ గాంధీ. ఎంతో చక్కగా నవ్వుతూ...అక్కడ పని చేస్తున్న వారి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా మాట్లాడుతూ ఫోటోలు దిగారు. రాహుల్ గాంధీ సింప్లిసిటీ అక్కడి వారినందరినీ ఆకట్టుకుంది. దాంతో పాటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. రాహుల్ మైసూర్‌పాక్ ఇవ్వడం, తానే వెళ్ళి కొన్నానని చెప్పడంతో ఆయన థ్రిల్ అయ్యారు. Shri @RahulGandhi gifts famous Mysore Pak to Shri @mkstalin. Celebrating the loving relationship he shares with the people of Tamil Nadu. pic.twitter.com/Lw8vYrCC8L — Congress (@INCIndia) April 12, 2024 వైరల్ అవుతున్న వీడియో.. రాహుల్ గాంధీ స్వీట్ షాప్‌కు వెళ్ళీ మైసూర్‌పాక్ తీసుకున్న వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన రోడ్డు దాటడం కోసం మధ్యలో ఉన్న బేరియర్ మీద నుంచి జంప్ చేయడం, షాప్‌లోకి వెళ్ళడం, అక్కడ వారితో నవ్వుతూ మాట్లాడడం...ఇలాంటివన్నీ వీడియోలో ఉన్నాయి. దీన్ని నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. దాంతో పాటూ రాహుల్ సిప్లిసిటీని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. Also Read:Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా? #stalin #congress #tamilnadu #rahul-gandhi #dmk సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి