Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.

New Update
Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి అభ్యున్నతి కోసం 13 వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని తీసుకుచ్చిందన్న ఆమె.. ఈ పథకం ద్వారా అనేక మంది పేద ప్రజల ఆరోగ్యాలు మెరుగయ్యాయన్నారు.

పేదలకు అయుష్మాన్‌ కార్డులు అందజేస్తామన్న పురంధేశ్వరి.. అర్హులు దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని సూచించారు. మరోవైపు పలు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందన్నారు. మహిళల చిరకాల ఆకాంక్ష 33 శాతం రిజర్వేషన్ల బిల్లు త్వరలోనే పాస్‌ అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం అవకాశం లభించే రోజు దగ్గర్లోనే ఉందని పురందేశ్వరి వివరించారు.

మరోవైపు పొత్తులపై మాట్లాడిన పురంధేశ్వరి.. పొత్తులు అనేవి ఎన్నికల ముందు నిర్ణయించేవని, సరైన సమయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఎన్టీఏ భాగస్వామ్యంతో ఉన్న బీజేపీతో తాను పొత్తుపెట్టుకున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడన్న ఆమె.. తమ వైఖరిని కూడా వీలైనంత త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్‌.. సీఐడీ ఎవరి పరిధిలో ఉంటుందని ప్రశ్నించారు. విపక్ష నేతలు ప్రతీ దానిని బీజేపీపై మోపడం తగదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పరందేశ్వరీ స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు