PM Modi: అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో.. : మోదీ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని..అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తులు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. By B Aravind 31 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మీరట్‌లోని మెగా ర్యాలీ వేదికగా ప్రధానమంత్రి మోదీ లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ (BJP) మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. రాబోయే ఐదేళ్లలో చేయాల్సిన కార్యక్రమాలపై రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తులు చేస్తున్నామని పేర్కొన్నారు. Also Read: ఏమయ్యా రేవంత్ … మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? సర్కార్ ను కడిగిపారేసిన కేసీఆర్..! అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించే ఎన్నికలు ఇక నుంచి దేశాన్ని తాము మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికలు కేవలం ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు మాత్రమే కాదని.. అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కరించే ఎన్నికలంటూ మోదీ అన్నారు. 2024 లో ప్రజలు ఇచ్చే తీర్పు.. ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దేశంలో ఆధునిక మౌళిక వసతులు వేగంగా ఏర్పాటవుతున్నాయని.. మహిళలు ముందడుగు వేస్తూ సత్తా చాటేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సాధికారత కోసం ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని.. పేదల సాధికారత కోసం తమ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా మరి కొన్నిరోజుల్లో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4 కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే కేంద్రంలో ఈసారి ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. Also Read: కేజ్రీవాల్, హేమంత్ సొరెన్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ #telugu-news #pm-modi #national-news #bjp #lok-sabha-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి