PM Modi:వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 450 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 డిశంబర్ కు పూర్తి అవుతుంది. శివుడి ప్రేరణతో దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

New Update
PM Modi:వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని

30 ఎక‌రాల్లో.. 450 కోట్లు పెట్టి .. వార‌ణాసిలో అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. శివుడి ప్రేర‌ణ‌తో ఆ స్టేడియం న‌మోనా త‌యారు చేశారు. శివుడి శిర‌స్సుపై ఉన్న నెల‌వంక రూపంలో స్టేడియం రూఫ్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఇక ఫ్ల‌డ్ లైట్ల‌ను త్రిశూలం ఆకారంలో.. ఘాట్ల శైలిలో ప్రేక్ష‌కుల గ్యాల‌రీ సీటింగ్.. మెటాలిక్ షీట్ల‌ను బిల్వ‌ప‌త్రం రూపంలో తీర్చిదిద్దుతున్నారు. యూపీలో కాన్పూర్, ల‌క్నో త‌ర్వాత ఇది మూడ‌వ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం కానున్న‌ది.

ఈ భూమి పూజ కార్యక్రమానికి మోదీతో పాటూ యూపీ సీఎం యోగి ఆదిత్యసాథ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగసర్కార్, కపిల్ దేవ్ హాజరయ్యారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జైషాలు కూడా పాల్గొన్నారు.

ఇక స్టేడియం శంకు స్థాపన చేశార ప్రధాని మోదీ మాట్లాడుతూ ...మహాదేవుడి నగరంలో నిర్మించిన ఈ స్టేడియం ఆ శివుడికే అంకితం అన్నారు. కాశీలో క్రికెట్ నేర్చుకోవాలనుకునేవాళ్ళకు ఈ స్టేడియం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుందని కొనియాడారు. ఏషియా గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధాని ఆల్ ద బెస్ట్ చేప్పారు.

బీసీసీఐ మొదటిసారిగా వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతున్నాని చెప్పారు.

మొత్తం 31 ఎకరాల విస్తీర్షంలో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో ఏడు పిచ్ లను సిద్ధం చేయనున్నారు. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ ను చూసేలా పోడియంలను నిర్మిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి దీనిని పూర్తి చేయనున్నారు. ఈ స్టేడియం నమూనా ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు