Pakistan : తొలిసారిగా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది

New Update
Pakistan : తొలిసారిగా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన పాకిస్థాన్‌

Lunar Mission : పాకిస్థాన్‌(Pakistan) ఎట్టకేలకు చంద్రుని(Moon) పై పరిశోధనలకు సిద్ధమైంది. విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించింది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పంపించింది. పాకిస్థాన్ చరిత్రలో చంద్రునిపై పరిశోధనలు చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(Institute Of Space Technology) తో కలిసి ఈ పేలోడ్స్‌ను రూపొందించింది. అయితే ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది. పాకిస్థాన్‌ ఉపగ్రహం ఐక్యూబ్‌ క్యూ, చైనా శాటిలైట్ చాంగ్ ఇ-6 ప్రోబోను జాబిల్లి పైకి చేర్చేందుకు లాంగ్ మార్చ్-5 వై9 రాకెట్‌ను ఉపయోగించారు.

Also Read: పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!

చైనా(China) లోని హైనన్ ఐలాండ్స్‌లో గల వెంఛెంగ్‌ స్పేస్‌ లాంచింగ్ స్పేస్ లాంచింగ్ సెంటర్ నుంచి శుక్రవారం రాత్రి 9.27 PM నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఐక్యూబ్‌ కమర్ శాటిలైట్.. ప్రయోగించిన తేదీ నుంచి 5 రోజుల తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ పేలోడ్ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది. 48 గంటల పాటు తవ్వకాలు జరుపుతుంది. అనంతరం రెండు కేజీల బరువు ఉండే చంద్రడి ధూళి, మట్టి శిలలను తీసుకొని మళ్లీ భూమిపైకి తిరిగొస్తుంది. మంగోలియాలో ఇవి ల్యాండ్ అయ్యేలా ప్రొగ్రామ్స్ చేశారు శాస్త్రవేత్తలు.

ఇక పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్ కమర్‌తో సహా.. రాడాన్ డిటెక్టర్- ఫ్రాన్స్, లూనార్ సర్ఫేస్ నెగెటివ్ అయాన్ అనలైజర్- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, లేజర్ యాంగిల్ రిఫ్లెక్టర్- ఇటలీ పేలోడ్స్‌ను కూడా లాంగ్ మార్చ్-5 వై8 రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఆ తర్వాత వీటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపడుతుంది. పాకిస్థాన్‌ చంద్రునిపైకి మొదటిసారిగా రాకెట్‌ను ప్రయోగించడంతో.. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రయోగంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.

Also read: ఈ దేశంలో డిజిటల్, రవాణా పూర్తిగా ఉచితం.. ఎక్కడంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment