Pakistan: ఇంటర్వ్యూ చేసిన పాపానికి ప్రాణం పోగొట్టుకున్నయూట్యూబర్

గత ఆదివారం ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అదే రోజున పాక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్‌ను పెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపాడు.

New Update
Pakistan: ఇంటర్వ్యూ చేసిన పాపానికి ప్రాణం పోగొట్టుకున్నయూట్యూబర్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం అభిప్రాయం అడిగినందుకే యూట్యూబర్‌లను కాల్చి చంపేశాడు సెక్యూరిటీ గార్డు. భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధంలా ఉంటుంది ఎప్పుడూ. ఇరు దేశాల్లో దీన్ని కేవలం మ్యాచ్‌ కింద ఎప్పుడూ చూడరు. ఇదే దృష్టి ఇప్పుడు యూట్యూబర్ ప్రాణాలను బలిగొంది. ఆదివారం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సాద్ అహ్మద్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అంతే మైక్ పట్టుకుని కరాచీలోని ఓ మార్కెట్‌లోకి వెళ్ళాడు. చాలా మందితో మాట్లాడాడు.

అయితే సడెన్‌గా ఇందులో ఊహించని ఘనట ఎదురైంది సాద్‌కు. ఇంటర్వ్యూలో భాగంగా అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను సాద్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ గురించి అడిగాడు. అతను స్పందించలేదు. అయినా కూడా సాద్ అతన్ని ఆ ప్రశ్న పదేపదే అడుగుతూనే ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్ ఎంత తప్పించుకుందామని చూసినా వదల్లేదు. దీంతో సహనం కోల్పోయిన గార్డ్ తన దగ్గర ఉన్న తుపాకీతో సాద్ మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు.

Also Read:World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment