Israel-Hamas War: 'ఇది ప్రమాదకరం'.. పుతిన్‌కు నెతన్యాహు ఫోన్ ! ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఇది ప్రమాదకరమైన సహకారమని అంసతృప్తి వ్యక్తం చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు. By B Aravind 11 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. మరోవైపు గాజాలో తిండి లేక అక్కడి స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితిలో ఈఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి దీన్ని తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా(America) మద్దితిస్తున్నంత వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుదని.. దీనివల్ల పశ్చిమాసియాలో భవిష్యత్తులో ఊహించని, నియంత్రించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయని.. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దుల్లాహియన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్‌కు ఇప్పుడు రష్యా సహకారం అందడంతో దీనిపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. Also Read: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ప్రకటన ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇది ప్రమాదకరమైన సహకారమని పుతిన్‌కు నెతన్యాహు చెప్పారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే దీనికి పుతిన్ కూడా స్పందిస్తూ ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పినట్లు పేర్కొంది. అలాగే ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్న దాన్ని ఖండించి తీరాలని పుతిన్ అన్నట్లు చెప్పింది. అలాగే అంతర్జాతీయ పర్యవేక్షణ బృందం గాజాకు వెళ్లి.. అక్కడి పౌరులకు అందుతున్న మానవతా సాయాన్ని పర్యవేక్షించాలని రష్యా విదేశాంగ శాఖ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. Also Read: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. అప్పట్లో బిల్లుపై ఏ పార్టీ ఎలా వ్యవహరించిందో తెలుసా? ఇదిలా ఉండగా.. హమాస్ మిలిటెంట్లను నెతన్యూహూ కూడా హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదు ఆయుధాలు విడిచి లొంగిపోవాలని.. పాలస్తీనియన్ గ్రూప్ మగింపు దగ్గరపడిందంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు తమ వాళ్లు లొంగిపోతున్నట్లు వస్తున్న వార్తల్ని హమాస్ కొట్టివేసింది. #telugu-news #putin #hamas-israel-war #benjamin-netanyahu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి