/rtv/media/media_files/2024/10/23/d4SyM0qtXrihuWGNNOaJ.jpg)
Zomato
అందరి బాటలోనే జొమాటో కూడా నడుస్తోంది. ఏఐను నమ్ముకుని ఉద్యోగాలను తొలగిస్తోంది. ఉద్యోగుల స్థానంలో ఏఐని ఉపయోగించుకుని.. ఖర్చులు తగ్గించుకునే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి 600మందిని ఉద్యోగం నుంచి తీసేసింది. తొలగించిన ఉద్యోగులు మొత్తం కంపెనీలో జాయిన్ అయి సంవత్సరం కూడా కాలేదని తెలుస్తోంది. తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐని ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ వెబ్‌సైట్ లో వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన, ఆర్థిక సంవత్సరం మొదలైన రోజునే ఈ ఉద్యోగుల తొలగింపు ప్రకటన రావడం గమనార్హం.
బ్లింకిట్ లో నష్టాలు..
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ లో జొమాటో చాలా ఏళ్ళుగా దూసుకుపోతూనే ఉంది. కానీ కొన్ని రోజుల క్రితం దీనికి అనుబంధ సంస్థగా బ్లింకిట్ ను ప్రవేశపెట్టింది. కానీ బ్లింకిట్ లో ప్రస్తుతం నష్టాలు పెరుగుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకే జొమాటో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు చెప్పింది. వారి స్థానంలో ఏఐను ఉపయోగించుకోవాలని అనుకుంటోంది జొమాటో. కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐని ఉపయోగిస్తోంది. దీనివల్ల తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకోవచ్చని భావిస్తోంది.
today-latest-news-in-telugu | zomato | lay-offs | employees
Also Read: Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్