/rtv/media/media_files/2025/02/15/yoyOYiPGAiK5zV7Jxxln.jpg)
Zelensky
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ (EU)కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం వచ్చిందన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఇరుదేశాల మధ్య పోరుకు ముగింపు పలకే ఆలోచన రష్యాకు లేదని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా సైనిక సాయం లేకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా తమకు సైనిక సాయాన్ని ఆపేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
ఇలాంటి సమయంలోనే యూరోపియన్ యూనియన్ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైనికులకు ట్రైనింగ్ ఇప్పిస్తామనే సాకుతో రష్యా తమ మిత్రదేశమైన బెలారస్‌కు సైన్యాన్ని పంపిచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. పుతిన్ ఆ దేశాన్ని మరో రష్యన్ ప్రావిన్సుగా భావిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు నాటో కూటమికి ముప్పు కలిగించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Also Read: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం
ఇదిలాఉండగా.. ట్రంప్ తాను అధ్యక్షుడిని అయిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన పుతిన్, జెలెన్‌స్కీలతో కూడా మాట్లాడారు. యుద్ధంలో ప్రజల ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు పుతిన్ తనతో ఫోన్‌లో అంగీకరించారని, ఉక్రెయిన్‌తో చర్చలకు కూడా సిద్ధమేనని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. కీవ్ నాటో సభ్యత్వం సాధ్యం కాదని ఆయనకు స్పష్టం చేశారు.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
Also Read: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా ?