/rtv/media/media_files/2025/02/26/AY0akYJOSn5tqEYNZI7A.jpg)
Amit Shah Touches Upon Tamil Debate
నూతన జాతీయ విద్యా విధానమపై కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలపై (Tamilnadu Government) గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ భాష ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అన్నారు. ఇలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని అక్కడి ప్రజలకు కోరారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
డీఎంకేను దేశ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) ఓడిపోతుందని అన్నారు. ఈసారి ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. '' 2024 బీజేపీకి చారిత్రాత్మక ఏడాదిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. చాలాకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర , హర్యాణా, ఢిల్లీ ప్రజలకు బీజేపీ నమ్మకంతో ఓటు వేసి అధికార బాధ్యతలు అప్పగించారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తున్నాం. 2-026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని'' అమిత్ షా అన్నారు.
Also Read: ముంచుకొస్తున్న ముప్పు.. అత్యంత కాలుష్య కోరల్లో భారత్.. టాప్-3లోనే!
Amit Shah Touches Upon Tamil Debate
ఇదిలాఉండగా జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని తమిళనాడు డీఎంకే ప్రభుత్వం చెబుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దితే ఊరుకునేది లేదని తేల్చిచెబుతున్నాయి. మరోవైపు సీఎం స్టాలిన్ కూడా జాతీయ విద్యా విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయమని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు ఏకంగా అధికార పార్టీ కార్యకర్తలే హిందీ భాషకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
Also Read : ఇక మనుషుల అవసరం ఉండదేమే!.. సీక్రెట్ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ చాట్‌బోట్‌లు