Air Quality: ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే!

ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్‌ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.

New Update
delhiairpollution41

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని, అసోంలోని బైర్నిహాట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉందని తాజా నివేదిక తెలిపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ ఐక్యూఎయిర్ ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’లో ఈ విషయం వెల్లడైంది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది.

Also Read: Dunki Route: డంకీరూట్‌ లో మరో ఇండియన్‌ మృతి..అక్కడే భార్య బిడ్డలు!

ఈ నివేదిక ప్రకారం, 2024లో ఇండియాలో కాలుష్యం కొద్ది మేర తగ్గిందనే తెలుస్తుంది. 2023లో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 సాంద్రత 54.4 మైక్రోగ్రాములు ఉండగా.. గత ఏడాది ఇది 50.6 మైక్రోగ్రాములకు తగ్గింది. అయినప్పటికీ, ప్రపంచంలోని టాప్-10 కాలుష్య నగరాల్లో ఆరు భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీలో ఏడాది సగటు చూస్తే.. పీఎం 2.5 సాంద్రత 91.6గా నమోదైంది. 2023లో ఇది 92.7గా ఉంది.

Also Read:AP Weather: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త

ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి. బైర్నిహాట్ (అసోం), ఢిల్లీ, ములాన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నొయిడా, భివాండి, ముఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నొయిడా‌ నగరాల్లో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది. మొత్తంగా ఏడాది పొడవునా భారత్‌లోని 35 శాతం నగరాల్లో పీఎం 2.5 సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే పది రెట్లు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం.

వాయు కాలుష్యం భారత ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. దీని వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది. గతేడాది లాన్సెట్ ప్లానెట్రీ హెల్త్ స్టడీ ప్రకారం.. 2009 నుంచి 2019 మధ్య కాలుష్యం కారణంగా ఏడాదికి సగటున 15 లక్షల మంది భారతీయులు ప్రాణాలు చనిపోయారు.

2.5 మైక్రాన్ల కంటే సూక్ష్మంగా ఉండే వాయు కాలుష్య కణాలను పీఎం 2.5గా పేర్కొంటారు. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తులు, రక్తంలోకి ప్రవేశించి శ్వాస సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు కూడా దారితీస్తాయి. ఇవి వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, పంట వ్యర్థాల ద్వారా వాతావరణంలోకి చేరుతున్నాయి.

డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. భారత్‌లో వాయు కాలుష్య డేటా సేకరణలో పురోగతి ఉన్నా.. నియంత్రణ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అన్నారు. ఎల్పీజీతో పాటు బయోమాస్ వినియోగం సహా కొన్ని సులభతరమైన పరిష్కారాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌లో ఉచిత గ్యాస్ పథకం అమలవుతోందని, అయితే అదనపు సిలిండర్లను సబ్సిడీ ద్వారా అందజేయాలన్నారు. ‘మొదటి సిలిండర్ ఉచితం.. కానీ పేద కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు అధిక సబ్సిడీలు పొందాలి... ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. బహిరంగ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది’ అని అన్నారు. అలాగే, ప్రజా రవాణాను విస్తరించాలని, కాలుష్య కారక వాహనాలపై భారీగా జరిమానాలు విధించాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు.

Also Read: Boat Accident: పడవ బోల్తా పడి 25 మంది మృతి..వారిలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు  కూడా!

Also Read: Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు