Crime News: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!

బీహార్‌లోని నలందా జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బహదూర్‌పూర్ గ్రామంలో ఓ మహిళను చిత్రహింసలు పెట్టారు. హత్యచేసి కాళ్లకు మేకులు కొట్టి, చేతిపై సూదితో గుచ్చి, మెడపై బూడిద చల్లారు. ఆపై రోడ్డుపై పడేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Woman Dead Body Found With 10 Nails Hammered Into Feet in Bihar Nalanda

Woman Dead Body Found With 10 Nails Hammered Into Feet in Bihar Nalanda

రోజు రోజుకూ దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ మహిళను అతి దారుణంగా హింసించి చంపారు. పాదాలకు మేకులు కొట్టారు. అక్కడితో ఆగకుండా చేతిని సూదితో గుచ్చారు. అలాగే మెడపై బూడిద జల్లారు. ఆపై ఆ మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ఈ ఘటన బీహార్‌లోని నలందజిల్లాలో జరిగింది. అందులోనూ సీఎం నితీష్ కుమార్ జిల్లాలో జరగడంతో విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు ఇది యావత్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

కాళ్లకు 10 మేకులు

నలంద జిల్లాలోని చండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్‌లో కొందరు దుండగులు ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. హత్య తరువాత పాదాలకు 10 మేకులు కొట్టారు. ఆపై కుడిచేతిపై సూదితో పొడిచిన గుర్తులు కనిపించాయి. అదే సమయంలో ఆ యువతి మెడపై బూడిద చల్లారు. ఇక హత్య చేసిన తర్వాత ఆ యువతిని నడి రోడ్డు పక్కన వదిలేశారు. స్థానిక గ్రామస్తులు ఈ మృతదేహాన్ని చూసి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. 

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

అయితే ఆమె ఎవరు? అనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది ఏ గ్రామం?.. ఆమెను ఇంతగా చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది?.. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హత్యకు ముందు ఆ మహిళపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

ఈ ఘటనపై హిల్సా డిఎస్పీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. బాధితురాలి వయస్సు 25- నుంచి -30 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. ఆమె పాదాలపై మేకులు కొట్టబడినాయని, ఆమె మెడపై బూడిద గుర్తులు ఉన్నాయని తెలిపారు. మృతదేహం కుడిచేతిపై సూదితో పొడిచిన గుర్తులు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు మృతదేహాన్ని గుర్తించలేదని.. సమాచారం జిల్లాకు, పొరుగు జిల్లాలకు పంపబడిందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment