Union Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగేవి...తగ్గేవి..

కేంద్ర బడ్జెట్ ను ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని తర్వాత చాలా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. ఇందులో కొన్నింటి మీద ధరలు పెరిగితే.. మరి కొన్నింటి మీద తగ్గుతున్నాయి. వివరాలు కింది ఆర్టికల్ లో..

New Update
india

Union Budget 2025

కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తయారీ, పారిశ్రామిక రంగాలకు ఉతమిచ్చేలా ప్రకటనలు చేశారు. సమ్మిళిత అభివృద్ధి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటూ కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ లను కూడా తగ్గించారు. మరి కొన్నింటి మీద పెంచారు. ఇది పలు వస్తువుల ధరల మీద ప్రభావం చూపిస్తుంది.  బడ్జెట్ తర్వాత ఈ కింది వస్తువుల ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతాయి. 

తగ్గే ధరలు..

ఎలక్ట్రానిక్స్, మందుల  ధరలు తగ్గనున్నాయి. వీటిలో వాడే వస్తువుల మీద సుంకాలు తగ్గించడంతో వీటి ధరలు కిందికి రానున్నాయి.  క్యాన్సర్‌, దీర్ఘకాల వ్యాధులను నయం చేసే 36 రకాల మందులపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించారు. అలాగే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్‌ సెల్స్‌, ఇతర పరికరాల బేసిక్‌ కస్టమ్‌ ట్యాక్స్ ను  5 శాతానికి తగ్గించారు. కోబాల్ట్‌ పౌడర్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ తుక్కు, లెడ్‌, జింక్‌ సహా 12 రకాల క్రిటికల్‌ మినరల్స్‌ను మీద కస్టమ్స్‌ సుంకం ఎత్తేశారు.   ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 35 రకాల ముడి పదార్థాలు, మొబైల్‌ ఫోన్‌ తయారీ బ్యాటరీలో వినియోగించే 28 అదనపు పరికరాలను పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చారు. దీంతో ఈవీలు, మొబైల్స్‌ ధరలు కూడా దిగి రానున్నాయి. మరోవైపు బూట్లు, షూస్ ధరలు తగ్గుతాయి. వెట్‌ బ్లూ లెదర్‌ను కస్టమ్స్‌ సుంకం నుంచి మినహాయించారు. దీంతో లెదర్‌ బూట్లు, బెల్ట్‌లు, జాకెట్ల ధరలు తగ్గనున్నాయి. శీతలీకరించిన చేపలపై  కస్టమ్స్‌ సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. కట్టడాలకు ఉపయోగించే పాలరాయి, ట్రావర్టిన్‌ వంటి వాటిపై టాక్స్ ను  40శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. అలాగే ముడి గ్రానైట్‌ లేదా ముక్కలుగా చేసిన గ్రానైట్‌పై కూడా సుంకం 40శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఆహార పదార్థాలు, శీతల పానీయాల ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్‌ ఫ్లేవరింగ్‌ పదార్థాలపై సుంకాన్ని 100 శాతం నుంచి 20శాతానికి తగ్గించారు. దీని వల్ల ఆహార పదార్ధల రేట్లలో కొం మార్పు రావొచ్చును. ఇక విదేశాల్లో తయారై, ఇక్కడకు వచ్చే కార్లు, మోటార్ సైకిళ్ళ మీద కూడా టాక్స్ ను బాగా తగ్గించారు. వీటితో పాటూ ఇంపోర్టెడ్ వ్యాన్లు, బస్సులపై కూడ ట్యక్స్ తగ్గింది. ఎలక్ట్రానిక్‌ బొమ్మల విడిభాగాలు,
ఆభరణాలు, స్వర్ణకారుల ఉత్పత్తులు మీద కూడా కస్టమ్స్ టాక్స్ తగ్గింది. 

ధరలు పెరిగేవి..

టీవీ ధరలు పెరగనున్నాయి. దీనికి కారణ వాటి కోసం వాడే ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లేపై సుంకాన్ని 10శాతం నుంచి 20శాతానికి పెంచడమే. దీంతో టీవీల ధరలు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇది వ్యాపారస్తులకు మలు చేసే అంశమే అయినా..సామాన్య మానవులపై భారం పడనుంది. అలాగే బట్టలు ధరలు కడా పెరుగుతాయి. ఎందుకంటే దేశీయ టెక్స్‌టైల్‌ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు.. అల్లికల దుస్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతం నుంచి 20శాతానికి పెంచారు.
దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు, విలాసవంత పడవలు పీవీసీ (పాలీవినైల్‌ క్లోరైడ్‌) ఉత్పత్తుల మీద, కూడా ట్యాక్స్ ను పెంచారు. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే షూస్ మీద కూడా కస్టమ్స్ ట్యాక్స్ ను పెంచారు. వీటన్నిటితో పాటూ స్మార్ట్‌ మీటర్లు, సోలార్‌ బ్యాటరీల మీద కూడా సుంకాన్ని పెంచారు. దీనివలన అవి వాడే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. 

Also Read: CBI: దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సీబీఐ సోదాలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు